Guntur Crime News: దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి.. ఆ తర్వాత మహిళపై..
Guntur District: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి.. దుండగులు మహిళపై
Guntur Gang Rape Case: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి.. దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోర సంఘటన బుధవారం రాత్రి మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఈక్రమంలో మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భార్యాభర్తలపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా.. ఈ సంఘటన అనంతరం.. బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందని తెలిపారు. దీంతో బాధితులు వెనుదిరిగి మేడికొండూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉంటే.. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలంటూ.. అంతకుముందు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆదేశాలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకునకేందుకు నిరాకరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: