Crime News: ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. గోదావరిలో పడి ఇద్దరు గల్లంతు!

Death by Selfie: సెల్పీ మోజులో మరో నిండు ప్రాణం బలైంది. గోదారి గట్టున నిలబడి నీటి పరవళ్లతో ఫోటో దిగాలనుకున్నారు. అంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన భద్రాది జిల్లాలో చోటుచేసుకుంది.

Crime News: ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. గోదావరిలో పడి ఇద్దరు గల్లంతు!
Death By Selfie
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 26, 2021 | 6:06 PM

Manuguru Selfie Death: సెల్పీ మోజులో మరో నిండు ప్రాణం బలైంది. గోదారి గట్టున నిలబడి నీటి పరవళ్లతో ఫోటో దిగాలనుకున్నారు. అంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన భద్రాది జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిని చూసేందుకు వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని జాలర్లు కాపాడారు. గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం చేపల కోసం వేసిన వలకు చిక్కింది. మృతుడు రామానుజవరానికి చెందిన సందీప్‌గా గుర్తించారు. మణుగూరు మండలం రామానుజవరానికి చెందిన నలుగురు యువకులు గోదావరి నది అందాలను చూసేందుకు వెళ్లారు. ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. యువకులంతా క్లాస్‌మేట్స్‌గా పోలీసులు గుర్తించారు. యువకుల గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

యువకులందరు కాలేజ్ మేట్స్ గుర్తించారు. గోదావరిలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఓ యువకుడి మృతదేహన్ని వెలికి తీసిన రిస్య్కూ టీం మరొకరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Read Also….  Rajnath Singh: శక్తివంతమైన బ్రహ్మోస్‌ చూస్తే శత్రు దేశాలు వణికిపోవాలిః రక్షణ మంత్రి రాజ్‌నాథ్