తల్లిపై జెలసీతో రెండేళ్ల బాబును చంపి బీరువాలో దాచిన మేనత్తలు

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. పసిపిల్లాడన్న కనికరం లేని సొంత మేనత్తలు దారుణానికి ఒడిగట్టారు. గొంతు నులిమి చంపి బీరువాలో దాచేసి జారుకున్నారు.

తల్లిపై జెలసీతో రెండేళ్ల బాబును చంపి బీరువాలో దాచిన మేనత్తలు
Follow us

|

Updated on: Oct 06, 2020 | 4:58 PM

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. పసిపిల్లాడన్న కనికరం లేని సొంత మేనత్తలు దారుణానికి ఒడిగట్టారు. గొంతు నులిమి చంపి బీరువాలో దాచేసి జారుకున్నారు. వదినపై జెలసీతో మేనల్లుడిపై చూపించిన్రు. కొడుకు కనిపించకుండా పోవడంతో ఊరంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు బాబు శవమై కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో ఈ ఘాతుకం జరిగింది.

గత నెల సెప్టెంబర్ 29న బాబు కనిపించడంలేదంటూ సూరజ్​పూర్​ పోలీస్​ స్టేషన్​లో తల్లి స్వప్న ఫిర్యాదు చేసింది. అయితే, అదేరోజు రాత్రి తన ఇంట్లోని బీరువాలో విగతజీవిగా పడి ఉన్న బాబును గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఊపిరాడక బాబు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో బాబు మేనత్తలు రింకి, పింకీలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని తేల్చారు. తమతో వదిన సరిగా ప్రవర్తించడంలేదని వాళ్లిద్దరూ గతంలో చాలాసార్లు అన్నకు ఫిర్యాదు చేశారు. అయినా వదినలో మార్పు రాలేదని కోపం పెంచుకున్నారు. పుట్టింటికి వచ్చినపుడు వదిన తమను సరిగా చూసుకోవడంలేదని, తోడబుట్టిన వాడు కూడా వదినకే వత్తాసు పలుకుతున్నడని ఇద్దరు ఆడబిడ్డలు పగ పెంచుకున్నారు. సొంత అన్న కూడా తమనే తప్పుబట్టడంతో వారి కోపం మరింత పెరిగింది. దీంతో రెండేళ్ల వయసున్న మేనల్లుడిపై చూపించారు. బాబు గొంతు నులిమి చంపేసి, దుప్పట్లో చుట్టి బీరువాలో దాచేశారు. ఆపై ఏమీ తెలియనట్లు తమ అత్తారింటికి వెళ్లిపోయారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బాబును చంపేసింది తామేనని అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!