ఆన్‌లైన్ రుణయాప్‌లపై హైకోర్టు ఆగ్రహం.. రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
ఆన్‌లైన్ రుణ యాప్ వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద..
ఆన్‌లైన్ రుణ యాప్ వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న రుణయాప్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రుణ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రుణ యాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్ లను సంప్రదించాలని డీజీపీకి ధర్మాసనం సూచించింది. రుణ యాప్ ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
సామాన్యులపై రుణ యాప్‌ల వేధింపులకు సంబంధించి న్యాయవాది కళ్యాణ్ దీప్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. చైనా రుణ యాప్ వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.రుణ యాప్ వేధింపులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని హైకోర్టు ఆదేచింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.
Read more: