Police Raid Gambling Den: హైదరాబాద్ పాతబస్తీలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు, 14మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ పాతబస్తీలో గుట్టుగా సాగుతున్న పేకాటరాయుళ్ల ఆటకట్టించారు పోలీసులు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నపేకాట స్థావరంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్,...
Police Raid Gambling Den: హైదరాబాద్ పాతబస్తీలో గుట్టుగా సాగుతున్న పేకాటరాయుళ్ల ఆటకట్టించారు పోలీసులు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నపేకాట స్థావరంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, స్థానిక కాలాపత్తర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. 14 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 2లక్షల 89 వేల నగదును, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తి కాలాపత్తర్ పోలిసు పరిధి, మొచి వాడ ప్రాంతంలో ఓ ఇంట్లొ పేకాట ఆడుతున్నారనే సమాచారముతో పోలీసులు రైడ్ చేశారు. ప్రధాన నిర్వాహకుడితో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొరకు అదుపులోకి తీసుకున్న 14 మంది పేకాట రాయుళ్లతో పాటు స్వాధీనము చేసుకున్న నగదును, సెల్ ఫోన్లను, ప్లే కార్డులను స్థానిక కాలాపత్తర్ పోలీసులకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
Also Read: