AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి వెలుగులోకి వచ్చిన చైనా ఆరాచకాలు… జిన్‌జియాంగ్‌లో మైనార్టీ మహిళలపై అఘాయిత్యాలు.. బయటపెట్టిన బీబీసీ

పశ్చిమ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లోని యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది చైనా..!

మరోసారి వెలుగులోకి వచ్చిన చైనా ఆరాచకాలు... జిన్‌జియాంగ్‌లో మైనార్టీ మహిళలపై అఘాయిత్యాలు.. బయటపెట్టిన బీబీసీ
Balaraju Goud
|

Updated on: Feb 04, 2021 | 3:25 PM

Share

Muslim women sexual abuse in Chine : పశ్చిమ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లోని మైనార్టీ వర్గం వీగర్‌ ముస్లిం పట్ల దమనకాండను చైనా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ వర్గం పట్ల యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది చైనా.. మైనార్టీ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, హింసకు గురయ్యారని బుధవారం ఒక బిబిసి నివేదిక తెలిపింది.

తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా ధ్రువీకరించింది. వీగర్‌ ముస్లిం జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, ఆ వర్గాల మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు వాడాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు బీబీసీ ఓ పరిశోధన బైటపెట్టింది.

మరోవైపు, ముస్లింలను క్యాంపుల్లో నిర్బంధిస్తున్నారని చైనా ప్రభుత్వంపై అనేక ఆరోపణలున్నాయి. చదువు, విజ్జానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10 లక్షల మంది వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. ముఖ్యంగా జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ.. అక్కడి ఉత్పత్తుల దిగుమతిపైనా నాటి అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించారు.

ఇప్పటికే నిర్భంధ క్యాంపుల్లో కాలం వెల్లదీస్తోన్న వీగర్లు.. అనేక వేధింపులకు గురవుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. షిన్‌జియాంగ్‌‌లోని మైనారిటీలను మారణ హోమానికి గురిచేస్తున్నట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ కమిషన్‌ తాజా నివేదిక వెల్లడించింది. సెన్సార్‌షిప్‌, బెదిరింపు ధోరణి, అణచివేత విధానాలతో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే ఎన్నో చర్యలను చైనా తీసుకున్నట్లు ‘కాంగ్రెషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ ఆన్‌ చైనా (CECC)’ నివేదిక పేర్కొంది.

ఇదిలావుంటే, మహిళలపై సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, హింసల పాల్పడుతున్న ఘటనలకు సంబంధించి సాక్ష్యాలను తాము అనుభవించి చూసినట్లు అనేక మంది మాజీ ఖైదీలు చెప్పినట్లు బీబీసీ తెలిపింది. ప్రతి రోజు రాత్రి క్యాంపుల్లోంచి మహిళలను తీసుకెళ్లి.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ముసుగు ధరించిన చైనీయులు అత్యాచారం చేశారని బీబీసీ నివేదిక తెలిపింది. రాత్రి సమయంలో క్యాంపుల్లో నుంచి వెళ్లిన కొందరు స్త్రీలు తిరిగి రాలేదని పేర్కొంది.

చదువు, విజ్జానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10 లక్షల మంది వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందనే ప్రచార జరిగింది. జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ విమర్శించిన అమెరికా.. వీటికి నిరసనగా అక్కడి ఉత్పత్తుల దిగుమతిపైనా నాటి అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, స్వయం ప్రతిపత్తి కలిగిన షిన్‌జియాంగ్‌ ప్రాంత ప్రజలు రెండు భాషలను నేర్చుకునే సౌలభ్యం ఉంది. స్థానిక బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తాజాగా తొలగించినట్టు బయటపడింది. అంతేకాదు, విద్యా సంస్థల్లో ఆ భాషను కూడా మాట్లాడకుండా మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.

జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో దుర్వినియోగ ఆరోపణలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌లు ఇస్లామిస్ట్ ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని అరికట్టడానికి వృత్తి శిక్షణనిచ్చాయని ఆరోపించారు. సౌకర్యాలలో ఉన్నవారు అప్పటి నుండి “గ్రాడ్యుయేట్” అయ్యారని వెల్లడించారు.

బిబిసి నివేదికకు సంబంధించి అడిగిన ప్రశ్నకు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ “పూర్తిగా వాస్తవిక ఆధారం లేకుండా ఉందని.. బిబిసి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో చైనా మానవత్వానికి, మారణహోమానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని అమెరికా ఆరోపణలు చేసింది. ఈ దురాగతాలు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, వీటిని వెంటనే ఆపకుంటే, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

Read Also… ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కలుషిత ఆహారం కలకలం.. ఆరోగ్య మంత్రితో సహా 145 మంది అస్వస్థత

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు