కొమురం భీం జిల్లా‌లో మళ్లీ పులి సంచారం.. తాజాగా ఆవుపై దాడి.. భయాందోళనలో స్థానికులు..

కొమురం భీం జిల్లాలో సంచరిస్తున్న పులులు ఇటీవల పలువురి ప్రాణాలను హరిస్తున్నాయి. జనాలు, మూగజీవుల

కొమురం భీం జిల్లా‌లో మళ్లీ పులి సంచారం.. తాజాగా ఆవుపై దాడి.. భయాందోళనలో స్థానికులు..
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2020 | 9:01 AM

కొమురం భీం జిల్లాలో సంచరిస్తున్న పులులు ఇటీవల పలువురి ప్రాణాలను హరిస్తున్నాయి. జనాలు, మూగజీవులపై విరుచుకుపడుతున్నాయి. ఇటీవల జిల్లాలోని ఓ వాగు దగ్గర యువకుడిని, పత్తి చేనులో ఓ యువతి ప్రాణాలను పొట్టన బెట్టుకున్నాయి. అటవీ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లాలంటే రైతన్నలు జంకుతున్నారు. సాయంతం అయిందంటే చాలు ఇళ్లలోంచి ప్రజలు ఎవరూ బయటికి రావడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా పెద్దపులి బెజ్జూరు మండలం తలాయి సమీపంలో సంచరిస్తోంది. ఇవాళ ఉదయం ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులుల సంచారం వల్ల కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. నిత్యం పులులు మూగజీవాల ప్రాణాలు తీస్తుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు.