సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాలిగామ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు
Gajwel: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాలిగామ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.