ఏసీబీ కస్టడీకి మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్, ఇతర నిందితులు
మెదక్ అడిషనల్ కలెక్టర్ అక్రమ చిట్టా కదిలించేందుకు పోలీసులు రెఢీ అవుతున్నారు. భారీస్థాయిలో లంచం తీసుకున్న కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

మెదక్ అడిషనల్ కలెక్టర్ అక్రమ చిట్టా కదిలించేందుకు పోలీసులు రెఢీ అవుతున్నారు. భారీస్థాయిలో లంచం తీసుకున్న కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఐదుగురు నిందితులను నాలుగురోజులపాటు కస్టడీకి ఏసీబీ కోర్టు ఒప్పుకుంది. ఈ నెల 21న చంచల్‌గూడ జైలు నుంచి మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మరో నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఏ1గా అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏ2 వసీం, ఏ3 అరుణారెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్‌గౌడ్‌లను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అరెస్టయిన నలుగురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇవ్వడానికి రూ.1.12కోట్లు లంచం డిమాండ్ చేశారు మెదక్ అడిషనల్ కలెక్టర్ గా నగేష్. ఈ మొత్తం రూ.1.12 కోట్ల డీల్‌లో రూ.40లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టబడ్డాడు. దీంతో నగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నగేష్‌తోపాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌లను కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందు నగేష్‌తో పాటు ఐదుగురి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా ఏసీబీ కోర్టు అనుమతితో ఈ కేసుకు సంబంధం ఉన్న మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.




