తప్పతాగిన చిందులేసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్‌తో చర్యలు.. టీచర్‌తో సహా ముగ్గురిపై వేటు..!

విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే నీఛ పనులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్దులు చెప్పి పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన వాళ్లే పక్కదారి పడుతున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:42 pm, Mon, 1 March 21
తప్పతాగిన చిందులేసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్‌తో చర్యలు.. టీచర్‌తో సహా ముగ్గురిపై వేటు..!

Drunken Teacher Suspended : విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే నీఛ పనులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్దులు చెప్పి పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన వాళ్లే పక్కదారి పడుతున్నారు. పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు పూటుగా తాగి ఆ మత్తులోనే అతడు చిందులు కూడా వేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు చేపట్టారు. సదరు అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగచూసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుతో సహా ఇద్దరు ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ టీచర్ సునీల్ తివారీ, క్లర్క్ వినోద్ హర్షల్, వాచ్ మాన్ శివకుమార్లను శనివారం సస్పెండ్ చేయగా, మరో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునే ప్రతిపాదనను డివిజనల్ కమిషనర్‌కు పంపినట్లు గిరిజన అభివృద్ధి అధికారి ఎస్ఎస్ మార్కమ్ తెలిపారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామని మార్కమ్ వెల్లడించారు.

Read Also… పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ వలసలు.. బీజేపీలో చేరిన బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ