దారుణం: రిమోట్ కోసం.. తండ్రినే చంపేశాడు..!
ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారు. టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కాలక్షేపం కోసం ఉపయోగించే వాటితో కాలం గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో పబ్ జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నాడని కన్నతండ్రినే ముక్కులుగా నరికి హతమార్చాడు ఓ యువకుడు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో యువకుడు రిమోట్ కోసం గొడవపడి.. కన్నతండ్రినే చంపేశాడు. నల్గొండ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరుమాళ్ల […]

ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారు. టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కాలక్షేపం కోసం ఉపయోగించే వాటితో కాలం గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో పబ్ జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నాడని కన్నతండ్రినే ముక్కులుగా నరికి హతమార్చాడు ఓ యువకుడు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో యువకుడు రిమోట్ కోసం గొడవపడి.. కన్నతండ్రినే చంపేశాడు. నల్గొండ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పెరుమాళ్ల గోవర్ధన్, అతని కొడుకు సతీష్‌తో కలిసి నల్గొండ జిల్లాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గోవర్ధన్ కూలి పనులకు వెళుతుంటాడు. సతీష్ అదే జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో టీవీ రిమోట్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న సతీష్ ఆవేశం పట్టలేక రోకలిబండతో తండ్రి తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి తండ్రి మృతి చెందాడు. అది తెలియని సతీష్.. రక్తపు మడుగులో ఉన్న తండ్రి పక్కనే పడుతున్నాడు. ఉదయం లేచే సమయానికి తండ్రి చనిపోయి ఉండటంతో స్థానికులకు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా టీవీ రిమోట్ విషయంలో తండ్రి, కొడుకులిద్దరికీ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక రాత్రి కూడా అదే విషయంలో గొడవపడి ఉంటారని పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.