Twist in Murder: క్రైమ్ కథా చిత్రాన్ని తలపించిన సింగోటం రాము హత్య.. తల్లి, కూతురే కీలకం!
పాతకక్షల కారణంగా ఒకరు... తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మరొకరు.. వాడుకున్నాం ఇక వదిలేద్దాం అనే స్వలాభాపేక్ష మరొకరిది...!! మొత్తానికి సింగోటం రాము అత్యంత కిరాతకంగా హతమయ్యాడు. వక్రమార్గంలో సంపాధించినా.. అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో సోషల్ సర్వీస్ చేస్తున్న రాము హతమయ్యాడు.
తల్లి చేసేదే పాడు పని.. చాలదన్నట్టు కూతురును కూడా గలీజ్ దందాలోకి దింపింది. డబ్బున్న వాళ్లను టార్గెట్ చేసి, హనీట్రాప్‌తో ఉన్నదంతా ఊడ్చేస్తారు తల్లీకూతుళ్లు. డబ్బులన్నీ దండుకున్నాక దూరం పెట్టి.. మరో బడాబాబును టార్గెట్ చేస్తారు. చేసేది వ్యభిచారవృత్తే అయినా.. విలాసవంత జీవితం. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ తరహా హనీట్రాప్‌తో తల్లీకూతుళ్లు కలిసి సింగోటం రామును గుట్టచప్పుడు కాకుండా మట్టుపెట్టారు. రాము నుంచి కోట్లు దండుకున్న తల్లీ, కూతురును ఎరగా వేసి పీడ వదిలించుకోవాలనుకుంది. పక్కా ప్లాన్‌తో రామును హత్య చేయించిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సింగోటం రాము హత్య కేసు విచారణలో సంచలన విషయాలు, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. రాముతో వ్యవహారం, రామును ట్రాప్ చేసిన తీరు, రాము హత్య… అంతా ఓ క్రైమ్ కథా చిత్రాన్ని మించి ఉంది. వెబ్‌సిరీస్ రేంజ్‌లో తల్లీకూతుళ్లు ఇద్దరూ.. రౌడీషీటర్లు, ప్రియుడితో కలిసి రామును అంతమొందించారు. దీంతో కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి, భర్తను వదిలేసి కూతురుతో సహా హైదరాబాద్‌కు మాకాం మార్చింది. యూసుఫ్‌గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగింది హిమాంబి. కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. హిమాంబి మాయలో పడ్డ కానిస్టేబుల్, డబ్బంతా ఆమెకే ఖర్చు పెట్టేశాడు. ఫ్యామిలీ, పిల్లలు అందరినీ దూరం పెట్టి హిమాంబినే ప్రపంచంగా మారాడు. చివరకు ఆ ఇంటిని కూడా హిమాంబి పేరు మీద రాసి ఇచ్చాడు. దీంతో తన పని పూర్తయ్యిందనుకున్న హిమాంబి.. ఆ కానిస్టేబుల్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ ఇల్లు తనదేనని, నువ్వెవరో నాకు తెలియదని బుకాయించి, పీడవదిలించుకుంది.
అంతేకాదు తన ఇంట్లోనే వ్యభిచార దందాకు తెరలేపింది. తాను వ్యభిచారం చేయడమే కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయించేది హిమాంబి. క్రమంగా బడా వ్యాపారులు, సంపన్నులను టార్గెట్ చేసింది. తన వలలో వేసుకుని.. అక్రమ సంబంధం పెట్టుకుని.. డబ్బులు దండుకునేది. కూతురు కూడా వయసుకు రావడంతో.. కూతురును కూడా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టింది. వేలు.. లక్షలు.. దాటి కోట్ల రూపాయల ఆస్తుల కూడబెట్టింది హిమాంబి. విలాసవంతమైన జీవితం ఉండటంతో.. కూతురు కూడా వ్యభిచార వృత్తికి అలవాటు పడింది.
ఇద్దరూ కలిసి బడాబాబులను హనీట్రాప్ చేయడం.. ఉన్నదంతా ఊడ్చేయడం.. ఏదోకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో హిమాంబికి పరిచయమయ్యాడు సింగోటం రామన్న అలియాస్ పుట్టా రాము. నాగర్‌కర్నల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంకు చెందిన రాము.. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ , ఇతర వ్యాపారాలతో కోట్ల రూపాయలు సంపాదించాడు. దీనికితోడు సిటీ శివార్లు అడ్డగా జువ్వ ఆడేవాడు. జువ్వ ఆటతో రెట్టింపు డబ్బు సంపాదించాడు. దాదాపు వంద కోట్ల రూపాయలకుపైగా సంపాదించిన రాము, హిమాంబికి పరిచయమవడంతో గోల్డెన్ ఛాన్స్ అనుకుంది. రాముని తన వలపు వలలో బంధించి.. కోట్ల రూపాయలు దండుకుంది. రాము సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హిమాంబికే సమర్పించుకున్నాడు. రాముతో డబ్బులు కూడా అయిపోయాయి. అప్పులు కూడా స్టార్ట్ చేశాడు.
ఇంతలో హిమాంబి దగ్గరకు వెళ్తున్న క్రమంలో హిమాంబి కూతురు నసీమాను చూశాడు రాము. కూతురుతో పడక సుఖం కావాలని అడిగాడు రాము. తన కూతురు అలాంటిది కాదని, అడ్డు చెప్పింది హిమాంబి. పలుమార్లు రాము ఏకంగా నసీమాను వేధించాడు. దీంతో తెలివిగా ఆలోచించింది హిమాంబి. ఇక రాముతో పనేముంది.. పీడ వదిలించుకోవాలనుకుంది. కూతురుతో కలిసి పక్కా ప్లాన్‌తో రామును అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. అయితే… రాము హత్యలో రౌడీ షీటర్లు, రాము స్నేహితుడు మణికంఠ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ !! సినిమాటిక్ రేంజ్ లో మణికంఠ, హిమాంబి, నసీమా, రౌడీషీటర్ల మధ్య పరిచయం వెలుగులోకి వచ్చింది.
సింగోటం రాము.. జువ్వ ఆడే క్రమంలో మణికంఠ, వినోద్ పరిచయం అయ్యారు. గ్యాంగులుగా ఏర్పడి పలు ప్రాంతాలకు వెళ్తూ జువ్వ ఆడేవాళ్లు. ఈ ఆటలో రాము వంద కోట్ల రూపాయల వరకు సంపాదించగా.. మణికంఠ, వినోద్ మాత్రం 20 కోట్ల వరకు సంపాందించారు. దీంతో.. ఈర్ఘ్య మొదలైంది. మనస్పర్ధలు వచ్చాయి. రాము, మణికంఠ మధ్య గొడవ జరిగింది. మణికంఠను తీవ్రంగా కొట్టి, కారుతో ఢీకొట్టి, కారును పైకి ఎక్కించి హత్య చేయబోయాడు రాము. లక్కీగా మణికంఠ ప్రాణాలతో బయటపడినప్పటికీ, మొహానికి తీవ్ర గాయాలై, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. రాము దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ… కక్ష పెంచుకున్నాడు. రివేంజ్ తీర్చుకోవాలని రామును ఎలాగైనా అంతంచేయాలని అనుకున్నాడు. పలుమార్లు రెక్కీకూడా నిర్వహించాడు.
రాము దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ… కక్ష పెంచుకున్నాడు. రివేంజ్ తీర్చుకోవాలని రామును ఎలాగైనా అంతంచేయాలని అనుకున్నాడు. పలుమార్లు రెక్కీ నిర్వహించి.. అటాక్‌కు ప్లాన్ చేసి విఫలమయ్యాడు. సరైన అవకాశం కోసం ఎదరుచూస్తున్నాడు మణికంఠ. ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు రాము, మణికంఠ, వినోద్‌లకు హిమాంబిని పరిచయం చేశాడు. హిమాంబి దగ్గరకు రాము వెళ్లే క్రమంలో వినోద్, మణికంఠలను కూడా తీసుకెళ్లేవాడు. వినోద్‌కు హిమాంబి కూతురు నసీమాతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. నసీమాను డీప్‌గా లవ్ చేశాడు వినోద్.
ఇంతలో సింగోటం రాము తనను వేధిస్తున్న విషయం ప్రియుడు వినోద్ తో చెప్పింది నసీమా. ఆగ్రహానికి లోనైన వినోద్ స్నేహితుడు మణికంఠకు విషయం చెప్పాడు. ఇదే అవకాశంగా మలుచుకున్నాడు మణికంఠ. ఎప్పటి నుంచో రాము హత్యకు ప్లాన్ చేస్తున్న మణికంఠ.. నసీమా, హిమాంబి సాయం కోరాడు.
రామును వదిలించుకోవాలని చూస్తున్న హిమాంబికి మణి, వినోద్‌లు కూడా తోడయ్యారు. హిమాంబి కూడా ఇదే అదునుగా భావించింది. రాముకు కాల్ చేసి పిలిచింది. ఎప్పటినుంచో తన కూతురుపై ఆశపడుతున్నావ్ కదా.. అవకాశం వచ్చింది.. వెంటనే ఇంటికి రా.. కూతురును రెడీ చేసి సిద్ధంగా ఉంచుతాను అని నమ్మబలికింది. దీంతో.. రాము ఆనందానికి అవదుల్లేవు. ఎంతోకాలంగా వేచిచూసిన అద్భుత క్షణం అనుకున్నాడు. ఉన్నపలంగా వెళ్లాడు. ఎక్కడికి వెళ్లినా ఐదారుగురు గ్యాంగ్‌తో వెళ్లే రాము, ఈసారి ఒంటరిగా వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ మద్యం బాటిల్ కూడా తీసుకెళ్లాడు.
యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్ నగర్‌లోని హిమాంబి ఇంటికి చేరుకున్నాడు రాము. ఈ విషయాన్ని వినోద్, మణికంఠలకు చెప్పింది హిమాంబి. అప్పటికే ప్లాన్ ప్రకారం.. రౌడీషీటర్ జిలానీతో పాటు బయట 11 మందితో ఎదురుచూస్తున్న గ్యాంగ్ హిమాంబి ఇంట్లోకి ప్రవేశించారు. నసీమా, హిమాంబి ముందే విచక్షణా రహితంగా కత్తులతో దాడిచేశారు. రాము మర్మాంగాలను కోశాడు వినోద్. రాము ఒంటిపై 25కిపైగా కత్తిపోట్లు అవడంతో అక్కికక్కడే ప్రాణాలు విడిచాడు రాము.
హత్యకు సహకరించిన రౌడీషీటర్ జిలానీ తన అనుచరులతో అక్కడి నుంచి పారిపోయాడు. మణికంఠ… రాము బామ్మర్ధికి వీడియో కాల్ చేశాడు. మీ బావను చంపేశానని.. వచ్చి బాడీ తీసుకెళ్లమని చెప్పాడు. మణికంఠ, వినోద్, మరికొందరు కలిసి రాంరెడ్డి నగర్‌లోని బార్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
పాతకక్షల కారణంగా ఒకరు… తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మరొకరు.. వాడుకున్నాం ఇక వదిలేద్దాం అనే స్వలాభాపేక్ష మరొకరిది…!! మొత్తానికి సింగోటం రాము అత్యంత కిరాతకంగా హతమయ్యాడు. వక్రమార్గంలో సంపాధించినా.. అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో సోషల్ సర్వీస్ చేస్తున్న రాము హతమయ్యాడు. ఇప్పుడిప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న రాము ఆశలు ఆవిరయ్యాయి. తాను పట్టిన కత్తికి తానే బలైనట్టు.. తన మనుషుల చేతుల్లోనే రాము బలయ్యాడు.
రాము హత్యతో ప్రమేయం ఉన్న మణికంఠ, వినోద్, మహ్మద్ ఖైసర్, కావలి శివకుమార్ అలియాస్ బండ శివ, కప్పల నిఖిల్ తో పాటు హత్యకు ప్రోత్సహించిన నసీమా, ఆమె తల్లి హిమాంబి అలియాస్ హసీనాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. రాము హత్యతో.. తల్లీకూతుళ్ల హనీట్రాప్ బయటపడింది. తల్లీకూతుళ్ల అరెస్ట్‌ను చూసిన కొందరు.. హమ్మయ్యా అనుకుంటున్నారట. హిమాంబితో వ్యవహారం నడిపిన తాము.. ఇంకా నయం రాము స్థానంలో తాము ఉండేవాళ్లమని దడుసుకుంటున్నారట.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..