గోవుల మృతి కేసు.. విచారణ చేపట్టనున్న సిట్
విజయవాడ కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని గోశాలలో 86 ఆవులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఫుడ్ పాయిజన్ అని నిర్ధారించినప్పటికీ.. ఘటనపై పలు అనుమానాలు తలెత్తడంతో.. విచారణకై సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ గౌతం సవాంగ్. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గోవుల మరణానికి కారకులను, అందుకు గల కారణాలను కనుగొనే దిశగా సిట్ విచారణ వేగవంతం చేయనుంది. కాగా విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో […]
విజయవాడ కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని గోశాలలో 86 ఆవులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఫుడ్ పాయిజన్ అని నిర్ధారించినప్పటికీ.. ఘటనపై పలు అనుమానాలు తలెత్తడంతో.. విచారణకై సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ గౌతం సవాంగ్. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గోవుల మరణానికి కారకులను, అందుకు గల కారణాలను కనుగొనే దిశగా సిట్ విచారణ వేగవంతం చేయనుంది. కాగా విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో భారీ సంఖ్యంలో గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, గతంలో కూడా ఇదే గోశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయాయి.