నిర్మల్ జిల్లా సౌంన్లీ గ్రామ సర్పంచ్‌పై వేటు.. ఈజీఎస్ ఉద్యోగిపై పెట్రోల్ దాడి చేసినందుకు విధుల నుంచి తొలగింపు..

|

Aug 12, 2021 | 11:25 AM

Nirmal District : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సౌంన్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పై వేటు పడింది. ఉపాధిహామి టెక్నికల్ అసిస్టెంట్

నిర్మల్ జిల్లా  సౌంన్లీ గ్రామ సర్పంచ్‌పై వేటు.. ఈజీఎస్ ఉద్యోగిపై పెట్రోల్ దాడి చేసినందుకు విధుల నుంచి తొలగింపు..
Sounley Village
Follow us on

Nirmal District : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సౌంన్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పై వేటు పడింది. ఉపాధిహామి టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై పెట్రోల్ దాడి కారణంగా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపించిన కలెక్టర్ చివరకు సర్పంచ్‌ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఉప సర్పంచ్‌గా విజయ గంగాధర్ కు సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎంపీఓ గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

గత కొన్ని రోజుల క్రితం సాయినాథ్ ఉపాధిహామి టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై పెట్రోల్ పోసి అంటించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపటంతో చికిత్స కోసం బైంసా ఆస్పత్రికి తరలించారు. ఉపాధి పనుల విషయంలో సంతకం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా, రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు సాయినాథ్‌పై కేసు కూడా నమోదు చేశారు.

దీనిపై బాధితుడు రాజు ఏం చెబుతున్నాడంటే.. ” సర్పంచ్ సాయినాథ్ నాపై రోడ్డు గ్రావెల్ బిల్లుల విషయంలో కక్ష పెంచుకున్నాడు. కావాలనే నాపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. నేను రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నా” తెలిపాడు. సర్పంచ్ సాయినాథ్ ఏం చెబుతున్నాడంటే.. ” గ్రామపంచాయతీలో పెండింగ్ బిల్లుల చెల్లింపులో టీఏ రాజు ఇబ్బంది పెట్టాడు. ఇది విసిగిపోయి పెండింగ్ బిల్లుల పైల్స్‌కు నిప్పంటించబోయాను అక్కడే ఉన్న రాజుపై పెట్రోల్ పడి గాయపడ్డాడు. కావాలని చేయలేదు” అని వివరణ ఇచ్చాడు.

Hair Fall Tips : ఈ 5 చిట్కాలు పాటిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది..! ఏంటో తెలుసుకోండి..

Mega Brother Nagababu: ఒకే ఫేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్ చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్

Delhi Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థుల హతం..