20 లక్షలు పోయాయని.. క్యూనెట్ బాధితుడి ఆత్మహత్య..

హైదరాబాద్‌లో క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరవింద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. క్యూనెట్ స్కామ్‌లో అరవింద్ 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతోనే ఆరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. మరోవైపు గతంలో క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల చీటింగ్‌కు పాల్పడి వందలాది మందిని నిండాముంచేసింది క్యూనెట్. క్యూనెట్ కంపెనీకి ప్రమోషన్ చేసిన ఏడుగురు సెలబ్రెటీలకు కూడా పోలీసులు […]

20 లక్షలు పోయాయని.. క్యూనెట్ బాధితుడి ఆత్మహత్య..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 31, 2019 | 11:47 AM

హైదరాబాద్‌లో క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరవింద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. క్యూనెట్ స్కామ్‌లో అరవింద్ 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతోనే ఆరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. మరోవైపు గతంలో క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల చీటింగ్‌కు పాల్పడి వందలాది మందిని నిండాముంచేసింది క్యూనెట్. క్యూనెట్ కంపెనీకి ప్రమోషన్ చేసిన ఏడుగురు సెలబ్రెటీలకు కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ఫ్రాఫ్, పూజా హెగ్డే, షారూఖ్ ఖాన్‌లకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.