చెల్లి కిడ్నాప్.. అక్క ఏం చేసిందంటే..
తన చెల్లిని ఎవరో ఎత్తుకుపోతున్నారని గ్రహించిన ఓ చిన్నారి.. వెంటనే చేసిన పనితో తిరిగి దక్కించుకుంది. ఈ మధ్య చిన్నారులు అదృశ్యం కావడం అధికంగా జరుగుతోంది.. తాజాగా ఇలాంటి ఘటనే చుండూరులో కూడా జరిగింది. స్ధానికంగా నివాసముంటున్న కె. సతీష్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప ఐదో తరగతి చదువుతుండగా చిన్న పాప అదే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. అయితే సోమవారం సాయంత్రం పాఠశాల వద్దకు ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు చిన్న […]
తన చెల్లిని ఎవరో ఎత్తుకుపోతున్నారని గ్రహించిన ఓ చిన్నారి.. వెంటనే చేసిన పనితో తిరిగి దక్కించుకుంది. ఈ మధ్య చిన్నారులు అదృశ్యం కావడం అధికంగా జరుగుతోంది.. తాజాగా ఇలాంటి ఘటనే చుండూరులో కూడా జరిగింది.
స్ధానికంగా నివాసముంటున్న కె. సతీష్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప ఐదో తరగతి చదువుతుండగా చిన్న పాప అదే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. అయితే సోమవారం సాయంత్రం పాఠశాల వద్దకు ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు చిన్న కుమార్తె గ్రీష్మను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. వారు కూర్చున్న ఆటో ముందుకు కదులుతుండగా అక్క చందన గట్టిగా కేకలు వేస్తూ వారిపై అక్కడున్న రాళ్ళను వారిపై విసిరింది. అరుపులు గట్టిగా వినిపించడంతో భయపడ్డ కిడ్నాపర్లు .. గ్రీష్మను అక్కడి వదిలి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటనపై స్ధానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.