సికింద్రాబాద్‌లో రెచ్చిపోయిన సైకోలు.. నడిరోడ్డుపై దారుణం..

హైదరాబాద్‌లో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన సైకోలు విరుచుకుపడ్డారు. రోడ్డున పోయే వారిపై అకారణంగా దాడిచేసి గాయపరిచారు. కత్తులు, బ్లేడ్లతో ఓ విద్యార్థి...

సికింద్రాబాద్‌లో రెచ్చిపోయిన సైకోలు.. నడిరోడ్డుపై దారుణం..
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2020 | 7:42 AM

హైదరాబాద్‌లో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన సైకోలు విరుచుకుపడ్డారు. రోడ్డున పోయే వారిపై అకారణంగా దాడిచేసి గాయపరిచారు. కత్తులు, బ్లేడ్లతో ఓ విద్యార్థి గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. సికింద్రాబాద్ లోని అల్వాల్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నపదో తరగతి విద్యార్థిపై ఐదుగురు వ్యక్తులు తెగబడ్డారు. పక్కకు తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. అదే గ్యాంగ్‌కి చెందిన మరో వ్యక్తి బ్లేడుతో విద్యార్థి గొంతు కోసి గాయపర్చాడు. అపస్మారకస్థితిలో ఉండగా వదిలి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న విద్యార్థిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. కుమారుడి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.