అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ..పోలీసుల లాఠీ చార్జ్..ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆందోళన నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఏబీవీపీ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అసెంబ్లీ ఎదుట

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ..పోలీసుల లాఠీ చార్జ్..ఉద్రిక్తత
Follow us

|

Updated on: Mar 11, 2020 | 12:34 PM

తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఏబీవీపీ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అసెంబ్లీ ఎదుట హైటెన్షన్ నెలకొంది. శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. సర్కార్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. విద్యారంగంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టులు, టీచర్ పోస్టులు వెంటనే భర్తి చేయాలంటూ నినాదాలు చేశారు.స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్  చేశారు. కేజీ టూ పీజీ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టం తేవాలంటూ అసెంబ్లీ ఎదుట బైఠాయించిన ఏబీవీపీ నేతలు ధర్నాకు దిగారు.

వందల మంది విద్యార్థులు ఒకేసారి అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు. గేట్లు పైకెక్కి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ విద్యార్థి నేతలు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలు, విద్యార్థి నేతలపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

గత కొద్దిరోజుల క్రితమే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఏబీవీపీ విద్యార్థి సంఘాలు..ఈ రోజు ఊహించని రీతిలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రైవేటు వెహికిల్స్, ఆర్టీసీ బస్సులో వచ్చిన ఆందోళనకారులు ఎవరికి దొరికిన దారిలో వారు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం, లాఠీచార్జ్ నేపథ్యంలో గేట్ నెంబర్ 1 వద్ద హైటెన్షన్ నెలకొంది. మరోవైపు నిజాం కాలేజ్ పరిసరాలు, హాస్టల్స్‌లలో ఇంకా ఆందోళనకారులు ఉన్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు మరింత పోలీస్ ఫోర్స్‌ని రంగంలోకి దింపింది.

Latest Articles
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం