Breaking: విషాదాంతంగా మిస్సింగ్ కేసు.. హత్యకు గురైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్..!

గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన గ్రూప్ 2 అధికారి ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొల్లబడ్డారం అడవుల్లో ఆయన మృతదేహం బయటపడింది.

Breaking: విషాదాంతంగా మిస్సింగ్ కేసు.. హత్యకు గురైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 10, 2020 | 6:07 PM

గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన గ్రూప్ 2 అధికారి ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొల్లబడ్డారం అడవుల్లో ఆయన మృతదేహం బయటపడింది. కాగా వరంగల్ జిల్లాకు చెందిన ఆనంద్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా.. ఈ నెల ఏడో తేదీన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఆ తరువాత ఇంటికి రాకపోవడంతో.. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గొల్లబడ్డారం అడవుల్లో ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరోవైపు ఆ రోజు నుంచి ప్రదీప్ రెడ్డి కూడా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రదీప్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.