AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు… చూస్తుండగానే

సంగారెడ్డిజిల్లా రామచంద్రాపురంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో దగ్ధం అయింది. ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో బస్‌ మొత్తం కాలిబూడిదైంది. అందరూ చూస్తుండగానే...

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు... చూస్తుండగానే
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2020 | 10:23 AM

Share

సంగారెడ్డిజిల్లా రామచంద్రాపురంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో దగ్ధం అయింది. ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో బస్‌ మొత్తం కాలిబూడిదైంది. అందరూ చూస్తుండగానే బస్సు మంటలకు ఆహుతైంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముంబైనుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన డ్రైవర్‌ రామచం‍ద్రాపురం జాతీయ రహదారిపై గల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26మంది ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ అప్రమత్త కారణంగా పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సులోని ప్రయాణికుల సామాన్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటం వల్లే ప్రయాణికులను కిందికి దించేయడంతో ప్రమాదం తప్పింది.

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!