ఆ హీరో పేరు చెప్పి.. రూ. 18 లక్షలు కొట్టేశాడు..!

టెక్నాలజీ పుణ్యమా అని సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల పేర్లు చెప్పి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య హీరోయిన్ కాజల్ పేరు చెప్పి ఏకంగా 60 లక్షల రూపాయలు కొట్టేశాడు ఓ సైబర్ నేరగాడు. తమిళనాడుకు చెందిన ఓ ఎన్నారై కొడుక్కి కాజల్ అంటే విపరీతమైన అభిమానం. అయితే […]

ఆ హీరో పేరు చెప్పి.. రూ. 18 లక్షలు కొట్టేశాడు..!
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2019 | 11:56 AM

టెక్నాలజీ పుణ్యమా అని సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల పేర్లు చెప్పి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య హీరోయిన్ కాజల్ పేరు చెప్పి ఏకంగా 60 లక్షల రూపాయలు కొట్టేశాడు ఓ సైబర్ నేరగాడు. తమిళనాడుకు చెందిన ఓ ఎన్నారై కొడుక్కి కాజల్ అంటే విపరీతమైన అభిమానం. అయితే కాజల్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తానంటూ ఏకంగా 60 లక్షలు కాజేశాడు. తాజాగా హీరో లారెన్స్ పేరు చెప్పి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి 18 లక్షల రూపాయలు కొట్టేశాడు.

తమిళనాడుకు చెందిన రామనాథపురం జిల్లాలో నివసిస్తున్న అల్ అమీన్, పత్తూన్ నిషాల కూతురు నీట్ పరీక్ష రాసింది. అయితే తనకు మార్కులు తక్కువ రావడంతో.. మెడికల్ సీటు కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. పత్తూన్ నిషా తన కూతురి మెడికల్ సీటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో ఈ విషయం చెప్పారు. అయితే తాను రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రాస్టుకు ఉపాధ్యక్షుడినని, లారెన్స్ ట్రాస్ట్ ద్వారా వూలూర్‌లోని మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దానికి కొంచెం ఖర్చవుతుందని చెప్పి రూ. 18 లక్షలు అడిగాడు. అందుకు అంగీకరించిన పత్తూన్ ప్రవీణ్ కుమార్ అకౌంట్‌కి డబ్బులు పంపింది. అయితే కొద్ది రోజుల తరువాత అనుమానం వచ్చి లారెన్స్ ట్రాస్టుకి ఫోన్ చేయడంతో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరు లేరని వారు తెలిపారు. దీంతో మోస పోయానని గ్రహించిన పత్తూర్ నిషా పోలీసులకు ఫిర్యాదు చేసింది.