కూలర్ కోసం వెంటిలేటర్ ప్లగ్ పీకేసిన కుటుంబ సభ్యులు.. రోగి మృతి
వెంటిలేటర్ ప్లగ్‌ను పీకేసి కూలర్‌కు కనెక్షన్ ఇచ్చారు ఓ రోగి కుటుంబ సభ్యులు. దీంతో వెంటిలేటర్‌లో పవర్ అయిపోవడంతో ఆ వ్యక్తి మరణించాడు.

వెంటిలేటర్ ప్లగ్‌ను పీకేసి కూలర్‌కు కనెక్షన్ ఇచ్చారు ఓ రోగి కుటుంబ సభ్యులు. దీంతో వెంటిలేటర్‌లో పవర్ అయిపోవడంతో ఆ వ్యక్తి మరణించాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకి వెళ్తే.. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల ఓ వ్యక్తి ఈ నెల 13న మహారావు భీమ్ సింగ్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరాడు. అయితే పరీక్షా ఫలితాల్లో అతడికి నెగిటివ్‌గా తేలింది. ఇదిలా ఉంటే ఐసీయూలో ఉన్న మరో వ్యక్తికి ఈ నెల 15న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవ్వగా.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అతడిని ఐసోలేషన్ వార్డుకు పంపారు. ఇక ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు కూలర్‌ను తీసుకొచ్చారు. అయితే దాన్ని పెట్టేందుకు ప్లగ్ లేకపోవడంతో వెంటిలేటర్ ప్లగ్‌ను తీసేసి, అక్కడ పెట్టారు. ఒక అర్ధగంటలో వెంటలేటర్‌లో పవర్ అయిపోవడంతో ఆ రోగి పరిస్థితి దిగజారింది. వెంటనే ఈ విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బందికి చెప్పగా.. వారు వచ్చే లోపు ఆ రోగి మృతి చెందాడు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణకు రోగి కుటుంబ సభ్యులు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రోగి చనిపోయిన తరువాత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
Read This Story Also: వైసీపీ నూతన రాజ్యసభ ఎంపీలకు జగన్ అభినందనలు



