crime: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
వాళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ బాసలు చేసుకున్నారు. ఒకరికి ఒకరంగా కలకలం కలిసి జీవించాలని ఎన్నో కలలుగన్నారు. కానీ, అంతలోనే విధి వారిని వెక్కిరించింది. ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రేమికులిద్దరూ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే...
వాళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ బాసలు చేసుకున్నారు. ఒకరికి ఒకరుగా కలకాలం కలిసి జీవించాలని ఎన్నో కలలుగన్నారు. కానీ, అంతలోనే విధి వారిని వెక్కిరించింది. ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రేమికులిద్దరూ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే…
నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన నవనీత, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన మోహన్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులిద్దరూ కలిసి జీవించలేకపోతే..కనీసం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యావన కేంద్రంలో ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని గమనించిన స్థానికులు, సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియురాలు నవనీత మృతిచెందగా, ప్రియుడు మోహన్ పరిస్థితి విషమంగా ఉంది.