షాకింగ్.. నిర్భయ దోషుల ఉరికి మళ్లీ బ్రేక్..?ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఉత్కంఠ..

నిర్భయ కేసులో దోషుల శిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. దోషులు ఉరితీత నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతునే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వల్ప గాయాలైన వినయ్ శర్మకు.. చికిత్స అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అతని తరఫు లాయర్ మాత్రం మరోలా చెప్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగిన సంఘటనలో వినయ్‌ శర్మ చేతి భుజం విరిగడంతో […]

షాకింగ్.. నిర్భయ దోషుల ఉరికి మళ్లీ బ్రేక్..?ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఉత్కంఠ..
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2020 | 4:39 AM

నిర్భయ కేసులో దోషుల శిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. దోషులు ఉరితీత నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతునే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వల్ప గాయాలైన వినయ్ శర్మకు.. చికిత్స అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అతని తరఫు లాయర్ మాత్రం మరోలా చెప్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగిన సంఘటనలో వినయ్‌ శర్మ చేతి భుజం విరిగడంతో పాటుగా.. తలకు బలమైన గాయాలయ్యాయని.. దీంతో కనీసం తన తల్లితోపాటు ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని వినయ్ శర్మ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వినయ్ శర్మకు మానసిక వైద్య కేంద్రంలో మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ వేసినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు తన క్షమాభిక్ష పిటిషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసినట్లు వినయ్‌శర్మ న్యాయవాది తెలిపారు. జనవరి 29న వినయ్‌శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ వేయగా అతని వినతిని తిరస్కరించాలని జనవరి 30న ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని.. అయితే ఈ సిఫార్సు చేసే సమయంలో.. పిటిషన్‌పై రాష్ట్ర హోంమంత్రి సంతకం చేశారని గుర్తు చేశారు. సదరు మంత్రి సంతకం చేసిన సమయంలో.. ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని.. అలాంటప్పుడు ఆయనకు సంతకం చేసే అధికారం లేదంటూ వాదిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చెల్లుతుందా?లేదా?అనే అంశాన్ని విచారించాలని కోరినట్లు వినయ్ శర్మ తరఫు లాయర్ ఏపీ సింగ్‌ తెలిపారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు