Bhuma Akhilapriya : భూమా అఖిలప్రియ కేసులో కొత్త ట్విస్ట్.. కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు..
Bhuma Akhilapriya Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. అందులో భాగంగా భూమా కుటుంబ
Bhuma Akhilapriya Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. అందులో భాగంగా భూమా కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ కంటే ముందు నిందితులతో విఖ్యాత్ మాట్లాడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ విచారణ ఆధారంగా విఖ్యాత్‌ను విచారించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పడు ఈ కేసులో భూమా అఖిల ప్రియతో పాటు, ఆమె భర్త, ఇప్పడు సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రెండు సిమ్‌లు వినియోగించాల్సిన అవసరం ఏమిటీ.. గుంటూరు శ్రీను పేరుతో తీసుకున్న సిమ్‌లు మీరెందుకు వాడుతున్నారు.. గుంటూరు శ్రీనుకి మీకు సంబంధం ఏంటి.. భార్గవ్ రామ్ ఎక్కడున్నాడు.. తప్పించుకు తిరుగుతున్న ఆ 14 మంది ఎక్కడున్నారు తదితర విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇళ్లకు పెరిగిన గిరాకీ.. అమాంతం పెరిగిన ధరలు.. కారణాలు ఏంటో తెలుసా..