AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother kills Children: భర్త తిట్టాడని భార్య ఘాతుకం.. ఇద్దరు కన్నబిడ్డల గొంతు కోసి తానూ ఆత్మహత్య.. పిల్లలిద్దరు మృతి

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో గొడవపడ్డ ఓ మహిళ.. కన్నకూతుళ్లను అతికిరాతకంగా హతమార్చింది. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది.

Mother kills Children: భర్త తిట్టాడని భార్య ఘాతుకం.. ఇద్దరు కన్నబిడ్డల గొంతు కోసి తానూ ఆత్మహత్య.. పిల్లలిద్దరు మృతి
Couple suicide attempt
Balaraju Goud
|

Updated on: May 17, 2021 | 10:20 PM

Share

Mother Suicide Attempt After Children Killed: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో గొడవపడ్డ ఓ మహిళ.. కన్నకూతుళ్లను అతికిరాతకంగా హతమార్చింది. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోగా, తల్లి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన గుంటూరి రంగయ్య, రమణమ్మల కుమార్తె ఆదిలక్ష్మి(25)ని సింగరాయకొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు సంతానం. ఒక పాప వయసు మూడేళ్లు కాగా, మరో పాపకు ఒక సంవత్సరం. అయితే, భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయి ఘర్షణ చోటుచేసుకుని 20రోజుల క్రితం ఆదిలక్ష్మి తన పుట్టిల్లు ఉప్పలపాడుకు వచ్చింది.

ఇదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం భర్తతో ఫోన్‌లో మాట్లాడగా అతడు దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిలక్ష్మి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు ముగ్గురినీ చీమకుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చిన్నారులిద్దరూ ప్రాణాలను కోల్పోయారు. ఆదిలక్ష్మిని చీమకుర్తి ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జిల్లాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also….  కేరళలో కెనరా బ్యాంకును మోసగించి రూ. 8 కోట్లు కాజేసిన క్లర్క్ అరెస్ట్….పోలీసులు వలపన్ని బెంగుళూరులో పట్టేశారు