Brutal Murder: మంచిర్యాలలో డబుల్ మర్డర్… తల్లీ కూతుళ్ల దారుణ హత్య
Brutally Murdered: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పూదారి విజయలక్ష్మి(47), రవీనా (23) దారుణ హత్యకు గురయ్యారు. తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అల్లుడిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలతో భర్తకు దూరంగా రవీనా ఉంటోంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. బృందావన్ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ జంట హత్యలు జరిగాయి. తల్లీ, కుమార్తె హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త విజయలక్ష్మీ, భార్య ప్రవీణను అల్లుడే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అల్లుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు నులిమి వీరిని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం విజయలక్ష్మి, ప్రవీణ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
