Manjusha Neogi: మరో మోడల్ ఆత్మహత్య.. వారంలోనే ముగ్గురు నటీమణుల సూసైడ్..

కోల్ కత్తాలోని పటులి ప్రాంతంలోని తన నివాసంలో మే 27న మంజుషా శవమై కనిపించింది (Manjusha neogi). సూసైడ్ చేసుకున్న మోడల్ ను మంజుషా నియోగిగా గుర్తించారు పోలీసులు..

Manjusha Neogi: మరో మోడల్ ఆత్మహత్య.. వారంలోనే ముగ్గురు నటీమణుల సూసైడ్..
Manjusha Neiogi
Follow us

|

Updated on: May 27, 2022 | 3:31 PM

కోల్‏కత్తాలో వరుస మోడల్స్ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారంలోనే ముగ్గురు మోడల్స్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం (మే 26న) నటి బిదిషా డీ మజుందార్ తన అపార్ట్‎మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఇప్పుడు మరో మోడల్ కూడా తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోల్ కత్తాలోని పటులి ప్రాంతంలోని తన నివాసంలో మే 27న మంజుషా శవమై కనిపించింది (Manjusha neogi). సూసైడ్ చేసుకున్న మోడల్ ను మంజుషా నియోగిగా గుర్తించారు పోలీసులు.. ఆమె గురువారం ఆత్మహత్య చేసుకున్న బిదిషా డీ మంజుదార్ స్నేహితురాలిగా గుర్తించారు. బిదిషా చనిపోయినప్పటినుంచి మంజుషా డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

మంజుషా తల్లి మాట్లాడుతూ.. తన కూతురు.. బిదిషా ప్రాణ స్నేహితులని.. బిదిషా మరణంతో తన కూతురు డిప్రెషన్లోకి వెళ్లిందని.. అప్పటినుంచి ఆమె తన స్నేహితురాలి గురించి ప్రతిక్షణం మాట్లాడుతుందని తెలిపింది. మంజుషా మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించి.. సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే కోల్ కత్తాలో వారంలోనే ముగ్గురు మోడల్స్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. మోన్న పల్లవి డే, నిన్న బిదిషా.. నేడు మంజుషా.