Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో అటవిక తీర్పు.. ప్రేమ జంటపై దాష్టీకం.. కట్టేసి కొట్టి.. టైర్లను మెడలో వేసి..

Crime News: మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అటవిక పాలన మరోసారి బయటపడింది. తప్పు చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సింది పోయి.. తామే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో అటవిక తీర్పు.. ప్రేమ జంటపై దాష్టీకం.. కట్టేసి కొట్టి.. టైర్లను మెడలో వేసి..
Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 22, 2021 | 10:25 AM

Villagers punished lovers: మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అటవిక పాలన మరోసారి బయటపడింది. తప్పు చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సింది పోయి.. తామే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ధార్ పరిధిలోగల ఒక గ్రామంలో ప్రేమ జంటకు తాలిబన్ల తరహా శిక్షను అమలు చేసిన ఉదంతం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయటపడింది. ధార్ అడిషినల్ ఎస్పీ దేవేంద్ర పాటీదార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన కుండీ గ్రామంలో సెప్టెంబరు 12 న చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఉదంతం సభ్య సమాజానికి తెలిసింది. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు.

కుండీ ప్రాంతానికి చెందిన ఒక యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు వారి కుటుంబసభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, తన ప్రియుడు గోవింద్‌తో కలసి గుజరాత్‌కు పారిపోయింది. దీంతో ఆ యువతి కుటుంబీకులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇంతలోనే ఆమె తన ప్రియుడితో పాటు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యలు.. ఆ ప్రేమికులిద్దరితో పాటు వారికి సహకరించిన మరో బాలికను కూడా చితకబాదారు. ఆ తరువాత వారి మెడలలో టైర్లు వేసి ఊరంతా తప్పారు. ఈ సందర్భంగా వీడియో కూడా తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also…  West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం.. ఓ కంపెనీ నిర్వాకంతో యువకుడు ఆత్మహత్య..

పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
విద్యార్ధులకు గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2025.. దరఖాస్తు ఇలా.
విద్యార్ధులకు గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2025.. దరఖాస్తు ఇలా.
వేసవిలో మహారాష్ట్ర పర్యటన బెస్ట్ ఎంపిక ప్రముఖ శైవ క్షేత్రాలు ఇవే
వేసవిలో మహారాష్ట్ర పర్యటన బెస్ట్ ఎంపిక ప్రముఖ శైవ క్షేత్రాలు ఇవే
సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి చుక్కలేనట..!
సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి చుక్కలేనట..!