Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girl Rape in Bus: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం.. స్లీపర్ కోచ్ బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం..!

కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాల దాడులు ఎక్కువవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహారిస్తున్నా.. కామాంధుల్లో భయం లేకుండాపోయింది. అభం శుభుం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు.

Girl Rape in Bus: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం.. స్లీపర్ కోచ్ బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం..!
Girl Raped
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 22, 2021 | 9:40 AM

UP Girl Rape in Bus: కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాల దాడులు ఎక్కువవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహారిస్తున్నా.. కామాంధుల్లో భయం లేకుండాపోయింది. అభం శుభుం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న బాలికను.. అదే బస్సు కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఫిరోజాబాద్ జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి బదర్‌పుర్‌ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్‌ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో కండక్టర్‌ బబ్లూ సహచరుడు అషు.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తులపై శికోహాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడు అషును అరెస్టు చేశామని తెలిపారు.

ఈ ఘోరాన్ని ఆమె తన తల్లికి వివరించింది.15 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి 11 గంటలకు బదర్‌పూర్‌లో బస్సు ఎక్కింది. బస్సు కొద్ది దూరం వెళ్లాక, ఇతర ప్రయాణీకులతో సహా, బాలిక కుటుంబం బస్సులో నుండి కిందకు దిగింది. ఆ సమయంలో బస్ కండక్టర్ సహాయకుడు అషు ఎగువ బెర్త్‌లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి బస్సు వద్దకు తిరిగి వచ్చినప్పుడు, ఈ దారుణాన్ని వివరించింది. ఆ తర్వాత ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ కండక్టర్ బబ్లు ఆమెను బయటకు గెంటివేశాడు.

ఆ తర్వాత అలీగఢ్‌లోని టప్పల్ సమీపంలో నిందితుడు అషు బస్సు నుంచి కిందకు దిగిపోయాడు. అనంతరం బబ్లూ మధురలోని నౌజీల్ ప్రాంతంలో దిగిపోయాడని బాలిక తల్లి చెప్పింది. మంగళవారం ఉదయం శికోహాబాద్ చేరుకున్న తర్వాత, మహిళ పోలీసులకు సమాచారం అందించగా, ఆషు, బబ్లూపై కేసు నమోదు చేశారు. అషును అరెస్టు చేసిన పోలీసులు.. మరో నిందితుడు బబ్లూను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Read Also… SAARC: తాలిబాన్ ప్రాతినిధ్యం కోసం పాకిస్తాన్ పట్టుదల.. వ్యతిరేకించిన భారత్.. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా!