AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్యూమెంట్స్‌ ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి, మద్యం తాగించాడు! మృగంలా మారి.. మాటల్లోని చెప్పలేని విధంగా..

భూమి అమ్మకం పేరుతో ఒక మహిళను మోసం చేసి, హత్య చేసిన ఘటనలో ఒక వ్యక్తి అరెస్టు అయ్యాడు. నిందితుడు రూ.6 లక్షలు తీసుకుని, ఆ తర్వాత మహిళను మద్యం తాగించి, గొంతు కోసి, శవాన్ని దహించాడు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

డాక్యూమెంట్స్‌ ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి, మద్యం తాగించాడు! మృగంలా మారి.. మాటల్లోని చెప్పలేని విధంగా..
Up Murder Case
Follow us
SN Pasha

|

Updated on: Apr 13, 2025 | 1:17 PM

తన భూమిని అమ్ముతానంటూ ఓ మహిళ వద్ద నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఇక భూమికి సంబంధించిన డాక్యూమెంట్స్‌ ఇస్తానని ఆమెను ఇంటికి రమ్మన్నాడు. ఆమెను మాటల్లో పెట్టి, మెల్లిగా మద్యం తాగించాడు. ఇక ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక వ్యక్తి ఒక మహిళకు మద్యం తాగించి, గొంతు కోసి చంపి , ఆపై నిప్పంటించిన సంఘటన జరిగింది.

నిందితులు శివేంద్ర యాదవ్ (26), అతని స్నేహితుడు గౌరవ్ (19) మొదట బాధితురాలికి ఆస్తి పత్రాలు అందించడానికి ఫోన్ చేశారు. ఆమె వచ్చిన తర్వాత, వారు ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఆమె గొంతుకోసి.. ఆ తర్వాత మృతదేహానికి నిప్పు అంటించారు. సగం కాలిన ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారని పోలీసులు తెలిపారు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అంజలి మృతదేహం శనివారం నది సమీపంలో ముక్కలైపోయిన స్థితిలో లభ్యమైంది.

నిందితుడు తన తండ్రికి, భార్యకు వీడియో కాల్ చేసి బాధితురాలి మృతదేహాన్ని చూపించాడని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె కాలిపోయిన స్కూటర్‌ను కాలువ దగ్గర కనుగొని, ఆమె వ్యాపార భాగస్వామిపై హత్య అభియోగం మోపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూమి అమ్ముతానని నిందితుడు అంజలి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడని ఆమె సోదరి కిరణ్ చెబుతోంది. తరువాత, పత్రాలు ఇచ్చే నెపంతో, అతను ఆమెకు ఫోన్ చేసి, ఇంటికి పిలిపించి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో యాదవ్, అతని భార్య నేరం అంగీకరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన