Lovers Suicide: సంగారెడ్డిలో విషాదం.. ప్రేమ జంట బలవన్మరణం.. నదిలోకి దూకి
Lovers Suicide in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి 5 నుంచి
Lovers Suicide in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి 5 నుంచి కనిపించకుండా పోయిన ప్రేమికులు కృష్ణవేణి, అనిల్.. ఆ తర్వాత మంజీరా నదిలో దూకి బలవన్మరణాకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ 5వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో గురువారం (జనవరి 6వ తేదీ) రోజు ఇరువురి కుటుంబసభ్యులు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాయికోడ్ మండలం సిరుర్ వద్ద కృష్ణవేణి మృతదేహం లభ్యమైంది. అనిల్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ సంగారెడ్డి పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా.. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరో ఘటన..
ఇదిలాఉంటే.. నిర్మల్ జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో యువతి, యువకుడి మృతదేహాలు కలకలం సృష్టించాయి. వాకర్స్‌కు శనివారం ఉదయం గడ్డెన్న వాగులో మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వాగులోని మృతదేహాలు యువతి, యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలు వెలికి తీసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: