Laptops Theft: గర్ల్‌ఫ్రెండ్‌కు అవమానం జరిగిందనే కోపంతో 500 ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన యువకుడు
Laptops Theft: ఐదు సంవత్సరాల కిందట తన ప్రియురాలికి జరిగిన అవమానానికి వినూత్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళ..

Laptops Theft: ఐదు సంవత్సరాల కిందట తన ప్రియురాలికి జరిగిన అవమానానికి వినూత్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళ సెల్వన్ కన్నన్ 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా చిత్రీకరించి, సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమె సహా వైద్య విద్యార్థులందరిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. అందుకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్థుల ల్యాప్‌టాప్‌లనే టార్గెట్ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాబ్‌లాప్‌ల దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ప్రతీకారంలో భాగంగా నిందితుడు ఇప్పటి వరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లను దొంగిలించినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్‌లో మెడికల్ కాలేజీల సమాచారం సేకరించి ఆ తర్వాత రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. తాను దొంగిలించిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారతదేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గత సంవత్సరం డిసెంబర్‌లో జామ్ నగర్‌లోని ఎంపీ షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
Fire Accident: ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు ఫైరింజన్ల సాయంతో..