Divya Dureja: గోవాలో ఫ్రెంచ్ మహిళపై లైంగిక దాడి.. ఎల్‌జిబిటిక్యూఐ యాక్టివిస్ట్ దివ్య దురేజా అరెస్ట్..
Divya Dureja: గోవాలోని ఒక రిసార్ట్‌లో ఎల్‌జిబిటిక్యూ యాక్టివిస్ట్, కవి, సైకాలజిస్ట్ దివ్య దురేజా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 28 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు గోవా పోలీసులు..
Divya Dureja: గోవాలోని ఒక రిసార్ట్‌లో ఎల్‌జిబిటిక్యూఐ యాక్టివిస్ట్, కవి, సైకాలజిస్ట్ దివ్య దురేజా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 28 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు గోవా పోలీసులు దివ్య దురేజాను అరెస్ట్ చేయగా.. బుధవారం బెయిల్ లభించింది. ఫిబ్రవరి 23న ఉత్తర గోవాలోని ఒక రిసార్ట్‌లో దివ్య దురేజా తనపై మత్తుమందు ప్రయోగించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫ్రెంచ్ మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు దురేజాపై 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఉత్తర గోవా ఎస్పీ ప్రసూన్ పేర్కొన్నారు. అనంతరం దురేజాను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఫ్రెంచ్‌కు చెందిన యోగా ట్రైనర్ జనవరిలో గోవా చేరుకుంది. ఈ క్రమంలో దురేజా తనను ఆహ్వానించి నాలుగున్నర గంటలపాటు బంధించి తనపై లైంగికంగా దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు పెర్నెం పోలీసులు క్రిమినల్, దాడి, నిర్భంధం తదితర కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన దురేజా ఒక ఎల్‌జిబిటిక్యూ కార్యకర్త, సైకాలజిస్ట్, కవిగా ప్రసిద్ది.
Also Read: