AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRANSCO: తెలంగాణ ట్రాన్స్‌‌కోపై డ్రాగన్ హ్యాకర్ల కన్ను.. అప్రమత్తతతో కుట్రను అడ్డుకున్న అధికారులు

Chinese Hackers Threaten To TRANSCO: తెలంగాణ విద్యుత్ సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. వెంటనే పసిగట్టిన తెలంగాణ అధికారులు హాకర్ల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. విద్యుత్..

TRANSCO: తెలంగాణ ట్రాన్స్‌‌కోపై డ్రాగన్ హ్యాకర్ల కన్ను.. అప్రమత్తతతో కుట్రను అడ్డుకున్న అధికారులు
TRANSCO
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2021 | 10:37 AM

Share

Chinese Hackers Threaten To TRANSCO: తెలంగాణ విద్యుత్ సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. వెంటనే పసిగట్టిన తెలంగాణ అధికారులు హాకర్ల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. విద్యుత్‌‌ సరఫరా చేసే స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌‌ఎల్‌‌డీసీ) కు చైనా హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని గుర్తించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్‌‌టీఐ) తెలంగాణ అధికారులను అలర్ట్‌‌ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు ఎస్‌‌ఎల్‌‌డీసీ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో హ్యాకర్ల ముప్పు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.

ట్రాన్స్‌‌కో ఎస్‌‌ఎల్‌‌డీసీ సిస్టమ్‌‌లను చైనాకు చెందిన థ్రెట్ యాక్టర్ గ్రూప్ కమాండ్ కంట్రోల్ సర్వర్లు హ్యాక్‌‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఈఆర్‌‌టీఇన్ బుధవారం అప్రమత్తం చేసింది. ఎస్‌‌ఎల్‌‌డీసీ వెబ్‌‌సైట్‌‌లో ఎలాంటి సమస్యలు తలెత్తినా.. ఏదైనా ఇబ్బందులు గుర్తించినా సర్వర్‌‌ ఐపీలను బ్లాక్‌‌ చేసి సర్క్యూట్‌‌ బ్రేకర్ల రిమోట్‌‌ ఆపరేషన్స్‌‌ తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. కంట్రోల్‌‌ సెంటర్‌‌ ద్వారా ముందస్తుగా రక్షణ చర్యలు తీసుకోవాలని సీఈఆర్‌‌టీఐ తెలిపింది.

దీనిపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. తెలంగాణ సర్వర్లలోకి చైనాకు చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని.. రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా గుర్తించి రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిందని ప్రభాకర్ రావు తెలిపారు. దీంతో భారతదేశ గ్రిడ్ మాత్రమే కాకుండా రాష్ట్ర గ్రిడ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు.

అయితే.. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటన అనంతరం అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అస్తవ్యస్తంగా మారింది. ముంబై శివారు ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలపాటు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ విద్యుత్ సంక్షోభానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. భారత పవర్ గ్రిడ్‌పై చైనా సైబర్ నేరగాళ్లు కన్నేశారని తెలిపింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పందించింది. చైనా హ్యాకర్ల ప్రభావం గ్రిడ్లపై పనిచేయలేదని ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

Divya Dureja: గోవాలో ఫ్రెంచ్ మహిళపై లైంగిక దాడి.. ఎల్‌జిబిటిక్యూఐ యాక్టివిస్ట్ దివ్య దురేజా అరెస్ట్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..