మూడేళ్ల బాలుడి శరీరంలో.. 11 సిరంజి సూదులు

కనీసం నోరు కూడా తెరిచి.. అమ్మా అని పిలవలేని మూడేళ్ల బాలుడి శరీరంలో.. 11 సిరంజి సూదులు గుచ్చి ఉన్నాయి. దీంతో.. చిన్నారి అల్లాడి పోతున్నాడు. శరీర అంతర్భాగాల్లో సూదులు గుచ్చుకుని పిల్లాడు..

మూడేళ్ల బాలుడి శరీరంలో.. 11 సిరంజి సూదులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 03, 2020 | 9:23 PM

కనీసం నోరు కూడా తెరిచి.. అమ్మా అని పిలవలేని మూడేళ్ల బాలుడి శరీరంలో.. 11 సిరంజి సూదులు గుచ్చి ఉన్నాయి. దీంతో.. చిన్నారి అల్లాడి పోతున్నాడు. శరీర అంతర్భాగాల్లో సూదులు గుచ్చుకుని పిల్లాడు తల్లడిల్లిపోతున్నాడు. ఆ బాధతో దాదాపు 15 రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ ఘటన వనపర్తిలోని వీపనగండ్లలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. అశోక్, అన్నపూర్ణ దంపతులకు ఒక్కగానొక్క మూడేళ్ల కుమారుడు లోక్‌నాథ్ ఉన్నాడు. అయితే.. గత 15 రోజుల నుంచి కంటిన్యూగా.. ఆ బాబు ఏడుస్తూనే ఉన్నాడు. అసలు విషయం ఏంటో తెలీక లోక్‌నాథ్‌ని తిప్పని ఆసుపత్రి లేదు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. కానీ.. ఇటీవల బాలుడి మలద్వారం వద్ద ఓ సూది ఉండటాన్ని గమనించిన తల్లిండ్రులు.. వెంటనే హుటాహుటిన.. బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు.

దీంతో.. డాక్టర్ ఎక్స్‌రే తీయగా.. ఏకంగా 11 సిరంజి సూదులు బాబు పొట్ట, తొడ, పిరుదుల భాగాల్లో కనిపించాయి. దాంతో అంతా ఒకేసారి షాక్ అయ్యారు. తొందరగా గమనించడం ద్వారా.. బాబు ప్రాణాలు దక్కాయని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం సర్జరీ చేసి కొన్ని సూదులను తొలగించారు వైద్యులు. అయితే అన్ని సూదులను ఒకేసారి తొలగించడం సాధ్యం కాదని.. మిగిలిన వాటిని కొంతకాలం తర్వాత తీస్తామని చెప్పారు. అయితే చిన్నారి పరిస్థితి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఎవరో ఇది కావాలని చేసి ఉంటారని.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.