Leopard: జాతీయ రహదారిపై చిరుత మృత్యువాత.. రోడ్డు దాటుతుండగా..
Leopard dead: మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెంకొండ సమీపంలో కాకతీయ స్కూల్ సమీపంలో రోడ్డుపై చిరుతపులి మృత్యువాత పడింది. దేవరకద్ర మండలం చౌదరిపల్లి సమీపంలోని
Leopard dead: మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెంకొండ సమీపంలో కాకతీయ స్కూల్ సమీపంలో రోడ్డుపై చిరుతపులి మృత్యువాత పడింది. దేవరకద్ర మండలం చౌదరిపల్లి సమీపంలోని 167 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండేళ్ల వయసున్న ఆడ చిరుతపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య తెలిపారు. తెల్లవారుజామున రోడ్డుపై చనిపోయి ఉన్న చిరుతను గుర్తించిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల మృతి చెంది ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం స్థానిక ఎస్ఐ భగవంత్ రెడ్డి అటవీ అధికారులకు సమాచారమచ్చారు.
ఫారెస్టు అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత వయస్సు రెండేళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కాగా 12 ఏళ్ల క్రితం ఇలాగే ఓ చిరుత చనిపోయిందని స్థానికులు వెల్లడించారు. 167 జాతీయ రహదారికి ఇరువైపుల మన్నెంకొండ, చౌదర్ పల్లి, వెంకటాయపల్లి గుట్టలు ఉండటంతో ఆహారం కోసం చిరుతలు తరచూ రోడ్డు దాటుతుంటాయని ఎఫ్ఆర్వో చంద్రయ్య పేర్కొన్నారు. చిరుత మృతిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Also Read: