30 లక్షల క్యాష్‌.. 45 తులాల గోల్డ్.. 4 కేజీల వెండి మాయం.. తల్లి ఇంట్లో దొంగతనం.. చేసింది ఎవరో కాదు..

తల్లి ఇంట్లో దొంగతనం జరిగింది. చేసింది ఎవరో కాదు.. కన్న బిడ్డలే. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. తల్లి అనారోగ్యాన్ని క్యాష్ చేసుకున్న..

30 లక్షల క్యాష్‌.. 45 తులాల గోల్డ్.. 4 కేజీల వెండి మాయం.. తల్లి ఇంట్లో దొంగతనం.. చేసింది ఎవరో కాదు..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 08, 2021 | 11:48 AM

తల్లి ఇంట్లో దొంగతనం జరిగింది. చేసింది ఎవరో కాదు.. కన్న బిడ్డలే. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. తల్లి అనారోగ్యాన్ని క్యాష్ చేసుకున్న కొడుకు, కుమార్తె చాలా న్యాక్‌గా నగలు, నగదు కొట్టేశారు. ఆ తర్వాత తమకేం తెలియనట్టు కలరింగ్ ఇచ్చారు. పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యాక మ్యాటర్‌ మొత్తం రివీల్ అయింది.

కేశవ్‌నగర్‌లో నివాసం ఉంటున్న 75ఏళ్ల అనసూయ ఆరోగ్యం బాలేక ఇబ్బందిపడుతోంది. దీంతో కాకతీయ నగర్‌లో ఉండే చిన్న కొడుకు సుధాకర్‌ ఇంటికెళ్లింది. ఇదే అదనుగా భావించిన అనసూయ బిడ్డలు.. తల్లి ఇంట్లోనే చోరీకి ప్లానేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి లాక్ బ్రేక్ చేశారు. లోనికెళ్లి సామాను గట్రా చెల్లాచెదురుగా పడేశారు. సేమ్ టు సేమ్ దొంగలు ఎలాగైతే చోరీ చేస్తారో అలాగే చేశారు.

చేసిందంతా చేసి ఆ తర్వాత తమకేం తెలియనట్టు అమాయకుల్లా నటించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఇంటిదొంగల గుట్టు తేల్చారు. కన్నబిడ్డలే చోరీకి పాల్పడ్డారని తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. 30 లక్షల క్యాష్‌, 45 తులాల బంగారం, 4 కేజీల వెండిని సీజ్ చేసిన పోలీసులు నిందితుల్ని రిమాండ్‌కి పంపారు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు