Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semen Terrorism: “సెమెన్ టెర్రరిజం” మహిళలపై వేధింపులలో ఇదో కొత్తకోణం..స్కలిస్తున్నారు కామాంధులు!

ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పబోయే విషయం కొత్తదిగా కనిపించవచ్చు. మామూలుగా మన సంస్కృతిని బట్టి చూస్తే కొంత అసహ్యకరమైన విషయం చెబుతున్నట్టు అనిపించవచ్చు. కానీ, మహిళలపై వేధింపులలో ఇదో కొత్త కోణం.

Semen Terrorism: సెమెన్ టెర్రరిజం మహిళలపై వేధింపులలో ఇదో కొత్తకోణం..స్కలిస్తున్నారు కామాంధులు!
Semen Terrorism
Follow us
KVD Varma

|

Updated on: Sep 08, 2021 | 12:45 PM

Semen Terrorism: ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పబోయే విషయం కొత్తదిగా కనిపించవచ్చు. మామూలుగా మన సంస్కృతిని బట్టి చూస్తే కొంత అసహ్యకరమైన విషయం చెబుతున్నట్టు అనిపించవచ్చు. కానీ, మహిళలపై వేధింపులలో ఇదో కొత్త కోణం. మహిళలను వేధించడం కొందరికి చాలా సరదా. మహిళలు రకరకాల వేధింపులకు గురి అవుతున్న సంఘటనలు ఎన్నో ఇప్పటివరకూ మనం చూస్తూ వచ్చాం. మన దేశంలో మహిళలను రకరకాల పద్ధతుల్లో వేధించడంపై వార్తలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ మహిళలపై వేధింపులను గురించిన సరైన వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురైన కేసు వెలుగులోకి వస్తే.. అప్పుడు ఆ వేధించిన విధానాన్ని బట్టి కేసు తీవ్రత అంచనా వేయడం.. దాని ప్రకారం శిక్షలు విధించడం జరుగుతూ వస్తోంది.

ఒక్కో కేసులో మహిళ ఇష్టం లేకుండా తాకినా నేరమే అనే తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఒక కేసు విషయంలో మహిళను తాకితే అది వేధింపు కిందకు రాదని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతు ఉండదు. ఇది మనదేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈమధ్యకాలంలో దక్షిణ కొరియాలో మహిళలపై కొత్త తరహా వేధింపులు ఎక్కువ అయిపోయాయి. దీనిని అక్కడి సోషల్ మీడియాలో “సెమెన్ టెర్రరిజం” అని పిలుస్తున్నారు. అక్కడ మహిళలను ఇలా వేధిస్తున్నారు. మహిళలకు చెందిన వస్తువులపై వీర్యాన్ని స్కలిస్తున్నారు దుండగులు. తద్వారా వారిని మానసికంగా వేధిస్తున్నారు. అయితే, ఈ వేధింపులు చట్టపరంగా మహిళా వేధింపుల పరిధిలోకి రావడం లేదు. ఇటువంటి విషయాలపై కేసులు నమోదు అయినా..అవి ఆస్తి నష్టం కేసులుగా పరిగణించి చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టేస్తున్నారు. ఎందుకంటే, ఈ తరహా వేధింపులు ఎక్కడా మహిళా వేధింపుల చట్టంలో పేర్కొని లేవు. ఇదే అదనుగా తమకు ఎవరిపైనా కోపం ఉంటే.. ఆ మహిళకు చెందిన వస్తువులు.. బట్టలు వంటి వాటిపై వీర్యాన్ని స్ఖలించి వేధిస్తున్నారు ఆకతాయిలు.

దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఈ ”సుమన్ టెర్రరిజం” కేసులలో ముఖ్యమైనవి కొన్ని ఇవీ..

  • సియోల్ లో ఒక వ్యక్తి గతేడాది జనవరి 20 నుంచి జూలై 14 వరకూ ఆరునెలల్లో.. ఆరుసార్లు ఒక మహిళా సహోద్యోగి కాఫీ కప్పులో స్ఖలనం చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. ఈ మే నెలలో సదరు పురుషుడికి 2,500 డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసును ”ఆస్తి నష్టం” కింద పరిగణించారు. అంటే, ఆమె కాఫీ కప్పును పాడు చేయడం అనే భావనలో శిక్ష వేశారు.
  • ఇది ఇంకా ఘోరం..2019 లో, గ్రాడ్యుయేట్ విద్యార్థి తనతో లైంగిక సంబంధాన్ని ఒప్పుకోనందుకు గానూ ఒక మహిళ కాఫీని ఏకంగా 54 సార్లు వీర్యం.. కఫం, భేదిమందులు అదేవిధంగా కామోద్దీపన కలిగించే మందులను కలిపి వేదిన్చాడు. దీంతో ఇది కూడా ఆస్తి నష్టం కేసు కిందే పరిగణించి.. పదే పదే అటువంటి పని చేసినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష వేశారు.
  • అలాగే, 2018 లో, సియోల్ సబ్‌వే స్టేషన్‌లో ఒక వ్యక్తి తన వీర్యం కలిగిన కండోమ్‌ను మహిళ బ్యాగ్‌లో ఉంచిన కేసు ఒకటి అక్కడి మహిళల వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీనిని కూడా ఆస్తి నష్టం కేసుగానే పరిగణించారు.
  • ఇక మహిళల స్నానపు గదులు, సబ్వేలు, హోటల్ గదులలో “మోల్కా” లేదా హిడెన్-కెమెరాతో పోర్న్ చిత్రీకరించడానికి పురుషులు చిన్న కెమెరాలను దాచి ఉంచే అంటువ్యాధి సమస్య ఉంది. 2019 లో దక్షిణ కొరియాలో మోల్కా సంబంధిత నేరాలకు సంబంధించిన 6,465 మందిలో 5,437 మందిని అరెస్టు చేశారు. కానీ BBC వివరాల ప్రకారం 119 – లేదా 2% మాత్రమే దోషులుగా నిర్ధారించారు.
  • దక్షిణ కొరియా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు బేక్ హై-రాయన్ దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీకి ఒక సవరణను సమర్పించారు. ఈ సవరణ ప్రకారం, “సెమెన్ టెర్రరిజం” అనేది “శారీరక సంబంధాలు కాని” వర్గంలోకి వచ్చే లైంగిక నేరం అని పేర్కొన్నారు. దీనిని లైంగిక నేరంగా ముద్ర వేయాలని బేక్ పిలుపునిచ్చారు.

మహిళల వ్యక్తిగత వస్తువులపై, లోపల రహస్యంగా పురుషులు స్ఖలనం చేసిన అనేక ఉన్నత స్థాయి సంఘటనల తర్వాత లైంగిక నేరంగా పరిగణించబడే పరిధిని విస్తరించాలని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం..వర్గాల లెక్కలు తేలలేదు..పాలన గందరగోళమే!

Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..