AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి షాపింగ్ పేరుతో రూ.1కోటి తీసుకున్న సియా.. ఆ తర్వాతనే సీక్రెట్ కోడ్ ప్లాన్ అమలు..

పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి సియా గోయల్ తీసుకున్న దాదాపు రూ.కోటి తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 'సిట్ డౌన్' అనే కోడ్ వర్డ్‌తో హత్యను అమలు చేయడంతో పాటు, టోల్‌ప్లాజాల్లో రికార్డు కాకుండా స్కూటర్‌లో ప్రయాణించడం వంటి పక్కా ప్రణాళికతో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

పెళ్లి షాపింగ్ పేరుతో రూ.1కోటి తీసుకున్న సియా.. ఆ తర్వాతనే సీక్రెట్ కోడ్ ప్లాన్ అమలు..
Ketan Agarwal Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2026 | 9:09 AM

Share

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పెళ్లి షాపింగ్ కోసం కేతన్ నుంచి సియా గోయల్ దాదాపు కోటి రూపాయలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బును షాపింగ్‌ కోసం కాకుండా తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న చేతన్.. కోటిరూపాయలతో కాస్త సెటిల్‌ అయ్యాక మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ దారుణానికి మే నెల ఆఖరులోనే ప్లాన్ వేశారు. జూన్ 14న తొలి ప్రయత్నంలో విఫలమైనా.. జూన్ 18న లోహగఢ్ కోటపై ఘాతుకానికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారం కేతన్‌ను లోహగఢ్ కొండ అంచునకు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. సిట్ ‌డౌన్ అనే సిగ్నల్‌తోనే కేతన్‌ను చంపాలని ముందే “కోడ్ వర్డ్” ఫిక్స్ చేసుకున్నారని తేలింది. టోల్‌ ప్లాజాలో తన విజువల్ రికార్డ్ కాకుండా ఉండేందుకు 90 కిలోమీటర్లు కారుకు బదులు స్కూటర్‌లో చేతన్ వచ్చినట్లు నిర్థారణైంది. హత్యకు 34నిమిషాలకు ముందు సియా-చేతన్ మధ్య సీక్రెట్ సంభాషణ జరిగినట్లు విచారణలో తేలింది. మేనెలాఖరులోనే మర్డర్ ప్లాన్‌ చేసి, జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్లు విచారణలో నిర్ధారణైంది.

లోహగడ్ కోటపై కేతన్ అంచు వద్ద నిలబడి ఉన్న సమయంలో.. సియా నీళ్లు తాగుతున్నట్లు లేదా షూలేస్ కడుతున్నట్లు కూర్చోవడమే చేతన్‌కు సిగ్నల్‌గా నిర్ణయించారు. ఆ సిగ్నల్ వచ్చిన వెంటనే చేతన్ వెనుక నుంచి తోసేయాలని ముందే నిర్ణయించినట్లు దర్యాప్తులో తేలింది. కేతన్ పడిపోతే సియాను పట్టుకునే అవకాశం లేకుండా ఉండేందుకే ఈ “సిట్ డౌన్ సిగ్నల్” ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. కేతన్ కింద పడేటప్పుడు సియాను పట్టుకోకుండా ఉండేందుకే ఇలా ప్లాన్ చేశారు. ఇది హత్య ఎంత పక్కా ప్రణాళికతో జరిగిందో చూపించే కీలక ఆధారంగా మారింది. డిజిటల్ ఆధారాలను తప్పించుకునేందుకు కూడా చేతన్ ప్రత్యేక వ్యూహం అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

టోల్‌ప్లాజాల్లో కార్ నంబర్ రికార్డ్ కాకుండా ఉండేందుకు.. పుణె నుంచి దాదాపు 90 కిలోమీటర్లు స్కూటర్‌పైనే లోహగడ్‌కు వెళ్లినట్లు విచారణలో తేలింది. ఆ స్కూటర్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.

ఇక హత్యకు కేవలం 34 నిమిషాల ముందే సియా తన ప్రియుడికి చివరి కాల్ చేసి ప్లాన్ అమలు చేసింది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిల పోలీస్ కస్టడీని పూణే కోర్టు జులై 3 వరకు పొడిగించింది. కస్టడీలో ఉన్న వీరిద్దరినీ పూణే పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us