AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : ముంబై హాస్పిటల్లో పవన్ కళ్యాణ్.. సర్జరీతోపాటు రెస్ట్ అవసమరన్న వైద్యులు..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత కొంత కాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం .. రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఆయన ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. పవన్ కళ్యాణ వెంట ఆయన సతీమణి అన్నా లెజనోవా సైతం వెళ్లారు.

Pawan Kalyan : ముంబై హాస్పిటల్లో పవన్ కళ్యాణ్.. సర్జరీతోపాటు రెస్ట్ అవసమరన్న వైద్యులు..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2026 | 9:07 AM

Share

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా భుజాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తి గా చిట్లడం.. భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం కారణంగా కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరీక్షల కోసం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. పవన్ వెంట ఆయన సతీమణి అన్నా లెజోనోవా సైతం ముంబై చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్దారించారు. ఇందుకు వెంటనే శస్త్రచికిత్స అవసరమని.. అలాగే ఆ తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతి కూడా ముఖ్యమని సూచించారు వైద్యులు. అయితే తనకు ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని.. వాటిని ముగించుకుని మళ్లీ వస్తానని వైద్యులకు పవన్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

అధికారిక కార్యక్రమాలు ముగించుకుని మరికొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులపాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి జనసేన అధికారిక ఖాతా ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..

పవన్ కళ్యాణ్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..

Follow Us