AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..

ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికి అవసరమైన డాక్యుమెంట్. ఇది లేనిది దేశంలో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేము. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందాలంటే ఆధార్ అవసరం. అలాగే ఏదైనా సేవలకు ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది.

Aadhaar Card: వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Jun 30, 2026 | 8:35 AM

Share

భారత్‌లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక కార్యకలాపాలు, రోజువారీ ధృవీకరణ కోసం ఇది అవసరమవుతుంది. దీంతో ఈ కార్డును ఎప్పుడూ మన వెంట ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ పథకాలు పొందటం నుంచి ఏదైనా ప్రూఫ్ వరకు ఆధార్ కార్డు అనేది అవసరం. అయితే మీరు ఇంటి దగ్గర ఆధార్ కార్డును మర్చిపోవడం లేదా ఫోన్‌లో డాక్యుమెంట్ లేని సమయంలో పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే మీరు వాటి అవసరం లేకుండానే వాట్సప్ ద్వారా సులభంగా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ఉపయోగించి వాట్సాప్‌లోనే సెకన్ల వ్యధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ద్వారా అదనపు యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకుండానే ఆధార్, ఇతర ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

-ఆధార్‌తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్

-యాక్టివ్‌గా ఉన్న డిజిలాకర్ ఖాతా

-మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నంబర్ 9013151515 సేవ్ చేసుకుని ఉండాలి.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

-9013151515 నంబర్‌ను మీ కాంటాక్ట్స్‌లో “MyGov హెల్ప్‌డెస్క్” పేరుతో సేవ్ చేసుకోండి

-వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్‌తో చాట్ ప్రారంభించండి

– “నమస్తే” లేదా “హాయ్” అని టైప్ చేయండి

-“డిజిలాకర్ సర్వీసెస్” ఆప్షన్ ఎంచుకోండి

-మీకు ఇప్పటికే డిజిలాకర్ ఖాతా ఉందో లేదో నిర్ధారించుకోండి. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి

– మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ నమోదు చేయండి

-మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి

-అనంతరం చాట్‌బాట్ మీ డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.

– సంబంధిత నంబర్‌ను టైప్ చేయడం ద్వారా జాబితా నుండి ఆధార్‌ను ఎంచుకోండి

-మీ ఆధార్ కార్డు వాట్సాప్ చాట్‌లో PDF ఫార్మాట్‌లో వస్తుంది

-మీరు పీడీఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ ఉపయోగించుకోవచ్చు

Follow Us
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ