పంజాబ్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడి హత్య.. తుపాకితో 20 రౌండ్ల కాల్పులు..
Sandeep Nangal Ambian: పంజాబ్‌లోని జలంధర్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు హత్యకు గురయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం సోమవారం సాయంత్రం జలంధర్‌లోని
Sandeep Nangal Ambian: పంజాబ్‌లోని జలంధర్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు హత్యకు గురయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం సోమవారం సాయంత్రం జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్ నంగల్ అంబియాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. సందీప్ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. సందీప్ దశాబ్దానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించాడు. పంజాబ్‌తో పాటు కెనడా, అమెరికా, బ్రిటన్‌లో తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను ఒక భారతీయ కబడ్డీ ఆటగాడు. సందీప్ తన విజయాలతో ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందాడు. అతని అథ్లెటిక్ ప్రతిభ, కబడ్డీలో నైపుణ్యం కారణంగా అతను కొన్నిసార్లు డైమండ్ పోటీదారుగా ఎంపికయ్యాడు.
అయితే ఈ కబడ్డీ ప్లేయర్ దాడిలో దాదాపు 12 మంది ప్రమేయం ఉన్నట్టు ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దాడి చేసినవారు సందీప్‌పై దూరం నుంచి వరుస కాల్పులు జరపడం మనం గమనించవచ్చు. ప్రజలు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీస్తారు. ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్‌గా సందీప్ స్టాపర్ పొజిషన్‌లో ఆడాడు. కబడ్డీ ఆడుతూ పెరిగాడు. రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లు ఆడుతూ కెరీర్‌ను ప్రారంభించాడు. అభిమానులు ఆయనను ‘గ్లాడియేటర్’ అని పిలుచుకునేవారు. అతను ఒక దశాబ్దానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించాడు. అయితే అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌పై దాడికి పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar
It has started… the deterioration..
Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state..
I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022