అమ్మాయిలకు డబ్బుతో వల.. ఒకటి కాదు రెండు కాదు 5వేల మంది విక్రయం.. ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తులో సంచలనాలు!
Human trafficking: దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5,000 మందికి పైగా బాలబాలికలను స్మగ్లింగ్ చేసిన పన్నాలాల్ మహతో అరెస్ట్.
Human Smuggler Arrest in Jharkhand: మనీలాండరింగ్ సంబంధించి ఒక కేసులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పన్నాలాల్ మహతో 5,000 మందికి పైగా బాలబాలికలను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ సంస్థ ఆదివారం సమాచారం ఇచ్చింది. పన్నాలాల్ మహతో అలియాస్ గంఝూ జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కేసు దర్యాప్తుకు సంబంధించి రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్నారు. ఈ సమయంలో నిందితుడిని అరెస్టు చేశామని ఈడీ పేర్కొంది. డిసెంబరు 10న, రాంచీలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు అతన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీకి పంపింది.
మహతో జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాకు చెందినవాడు. అమ్మాయిలను అక్రమంగా తరలించి, దారుణాలకు ఒడిగట్టిన నేరాలకు పాల్పడినందుకు 2015లో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మహతోపై ఖుంటి, రాంచీ, ఢిల్లీలలో ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కిడ్నాప్, స్మగ్లింగ్‌కు సంబంధించి కేసులు నమోదయ్యాయి,” అని డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
అతను 5,000 కంటే ఎక్కువ మందిని అక్రమంగా రవాణా చేసి ఉంటాడని అంచనా వేసినట్లు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ తెలిపింది. జార్ఖండ్‌లో అతిపెద్ద మానవ స్మగ్లర్‌ను పోలీసులు ఖుంటి నుంచి అరెస్టు చేశారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాల్లో వేల సంఖ్యలో మైనర్ బాలబాలికలను విక్రయించాడు. ఖుంటిలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో 6 ఆగస్టు 2018న నమోదైన కేసు ఆధారంగా అతని అరెస్టు జరిగింది. ఈ కేసులో ఖుంతీకి చెందిన ముగ్గురు మైనర్ బాలికలను ఢిల్లీకి తీసుకెళ్లి అమ్మేశాడు. పన్నా లాల్, అతని భార్య సునీత 2003 నుండి మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ 16 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా సంపద సృష్టించారు. దీంతో కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది.
పన్నాలాల్‌పై జార్ఖండ్‌కు చెందిన వందలాది మంది బాలికలను దేశ, విదేశాలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పన్నాలాల్ కేవలం అమ్మాయిలతో డీల్ చేయడమే కాకుండా కోట్లాది రూపాయల ఆస్తికి యజమాని. పన్నాలాల్ ఢిల్లీలో ప్లేస్‌మెంట్ ఏజెన్సీ పేరుతో అమ్మాయిలను అమ్మే వ్యాపారం చేసేవాడు. పన్నాలాల్ ఉద్యోగాల పేరుతో పలువురు అమ్మాయిలను విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అమ్మాయిల వ్యాపారంలో పన్నాలాల్ భార్య కూడా అతనికి పూర్తి మద్దతు ఇచ్చింది. పన్నాలాల్ గ్యాంగ్‌లో 2 డజన్ల మందికి పైగా అమ్మాయిలను అమ్మడం, కొనడం వంటి పనులు చేస్తుంటారు. ఈడీ పన్నాలాల్‌ను విచారించిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పన్నా లాల్ గిరిజనుల పిల్లలను డబ్బులిస్తామని ప్రలోభపెట్టి తన వెంట తీసుకెళ్లేవాడు. అరెస్టు తర్వాత విచారణ సందర్భంగా, పన్నా లాల్ తనకు ఢిల్లీలో మూడు ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు ఉన్నాయని, వాటి ద్వారా మానవ అక్రమ రవాణా నుండి బయటకు తీసుకువచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలను పంపుతున్నట్లు పోలీసులకు చెప్పాడు. జార్ఖండ్, ఒడిశా నుంచి తీసుకెళ్లిన పిల్లలను ఇంటిపని, కట్టుదిట్టమైన పనులు చేయిస్తున్నారని కూడా అంగీకరించాడు. ఈ పనిలో, వివిధ జిల్లాల్లో చురుకైన బ్రోకర్లు. ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు ఇందులో పాల్గొన్నారు. దీంతో చాలా మంది అమ్మాయిలు తప్పుడు వ్యాపారంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Read Also… Goa Assembly Elections: గోవాలో పాగా కోసం టీఎంసీ ఎత్తులు.. రెండు రోజు పర్యటనకు బెంగాల్ సీఎం మమతా