మ్యాట్రిమోని పెళ్లికొడుకు డ్రామా.. 2.44 లక్షలు మాయం!

జల్సాలకు అలవాటు పడిన కొందరు టెక్నాలజీని అడ్డాగా చేసుకుని పలు నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్ల ఎత్తులకు ఎందరో బాధితులు బలవుతున్నారు. ఎన్ని రకాలుగా వాటిపై అవగాహన కల్పించినా బాధితులు పెరుగుతున్నారే తప్ప.. పరిష్కారం దొరకడం లేదు. తాజాగా పెళ్లి మోజులో పడి మరో యువతి మోసపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కైలాసపురంకు చెందిన చిత్ర చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. తాజాగా.. ఆమెకు మ్యాట్రిమోనీలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. […]

మ్యాట్రిమోని పెళ్లికొడుకు డ్రామా.. 2.44 లక్షలు మాయం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2020 | 2:42 PM

జల్సాలకు అలవాటు పడిన కొందరు టెక్నాలజీని అడ్డాగా చేసుకుని పలు నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్ల ఎత్తులకు ఎందరో బాధితులు బలవుతున్నారు. ఎన్ని రకాలుగా వాటిపై అవగాహన కల్పించినా బాధితులు పెరుగుతున్నారే తప్ప.. పరిష్కారం దొరకడం లేదు. తాజాగా పెళ్లి మోజులో పడి మరో యువతి మోసపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కైలాసపురంకు చెందిన చిత్ర చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది.

తాజాగా.. ఆమెకు మ్యాట్రిమోనీలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటామాటా కలిసి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాని చెప్పిన పెళ్లికొడుకు. ఒక రోజు కలవాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఆమెను చూసేందుకు యూకే నుంచి చెన్నైకి వస్తున్నానని.. అయితే ఫ్లైట్ మారండం కోసం ఢిల్లీలో దిగానని.. యూకే కరెన్సీ ఉండంతో పోలీసులు నన్ను పట్టుకున్నారని.. బెయిల్ కోసం 5 లక్షలు అడుగుతున్నారని చిత్రను కోరాడు నేరగాడు. దీంతో.. చిత్ర అతని అకౌంట్లో రూ.2 లక్షల 44 వేలు వేసింది. అకౌంట్లో డబ్బులు పడగానే.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయం అయిపోయాడు నిందితులు. అసలు విషయం అర్థం చేసుకున్న చిత్ర.. పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.