నమ్మిన ప్రియుడు నట్టేట ముంచాడు.. అవమానంతో భర్త తనువు చాలించాడు.. ఆత్మహత్య చేసుకోబోతే బిడ్డ చనిపోయింది.. చివరికి..

Telangana: వివాహేతర సంబందం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ప్రియుడు చేతిలో మోసపోయి మూడేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ మహిళ ఆస్పత్రి పాలైంది.

నమ్మిన ప్రియుడు నట్టేట ముంచాడు.. అవమానంతో భర్త తనువు చాలించాడు.. ఆత్మహత్య చేసుకోబోతే బిడ్డ చనిపోయింది.. చివరికి..
Illegal Relationship
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2021 | 6:37 PM

Telangana: వివాహేతర సంబందం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ప్రియుడు చేతిలో మోసపోయి మూడేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ మహిళ ఆస్పత్రి పాలైంది. తల్లి తీసుకున్న నిర్ణయానికి మూడేళ్ల చిన్నారి బస్టాండ్ లోనే తనువు చాలించింది. మరోవైపు భార్య ప్రియుడితో వెళ్లిపోయిందన్న మానసిక వేదనతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్త. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగాంలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగాం కు చెందిన మహిళకు పోతన్న అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు ‌కూతుర్లు ఉన్నారు. వీరి కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది. మూడు నెలల క్రితం సదరు మహిళకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి‌ దారి తీసింది. తాజాగా మూడు రోజుల క్రితం మహిళ ఇంటికి‌ వచ్చిన శ్రీకాంత్ రెడ్డి తనతో పాటు రావాలని ఒత్తిడి చేశాడు. దాంతో ఆమె తన రెండేళ్ల కూతురు క్యూటీని తీసుకుని శ్రీకాంత్ రెడ్డి తో వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు నిజామాబాద్ లోని ఓ లాడ్జ్ లో వారితో పాటు ఉన్న శ్రీకాంత్ రెడ్డి.. మరుసటి రోజు ఉదయం కనిపించకుండా పోయాడు. పోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది బాధిత మహిళ. వెంటనే అక్కడి నుంచి నిర్మల్‌కు బయలుదేరింది. ఇంటికి వెళ్లేందుకు ఇష్టంగా లేకపోవడంతో నిర్మల్ బస్టాండ్ లోనే ఉండిపోయింది. ప్రియుడు మోసం చేసాడని.. ఇంటికి వెళితే పరువు పోతుందని భావించి మూడేళ్ల కూతురుకు పురుగుల మందు తాగించి తాను సైతం సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి క్యూటీ బస్టాండ్ లోనే చనిపోయింది. మహిళ పరిస్థితి ని గమనించిన బస్టాండ్ లోని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

ఇదిలాఉంటే.. సదరు మహిళ తన ప్రియుడితో కలిసి ఇళ్లు వదిలి ‌వచ్చిన రోజు నుండి ఆమె పోతన్న కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే బోరిగాంలోని చెరువు వద్ద పోతన్న చెప్పులు, బైక్, ఫోన్ లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా పోతన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మహిళను నమ్మించి మోసం చేసి పరారైన ప్రియుడు శ్రీకాంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సాఫీగా సాగుతున్న సంసారంలో వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంటే.. చెరువులో దూకి‌ ఆత్మహత్య చేసుకున్నాడు భర్త పోతన్న. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరంటే? ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Viral Video: విసిగిపోయాడు.. పెట్రోల్ పోసి బైక్‌ను తగలబెట్టాడు.. ఎక్కడంటే.!