Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. బిర్యానీ తినేందుకు వెళ్లిన కార్మికుడు చివరకు..

రాత్రంతా పనిచేసిన ఓ భవన నిర్మాణ కార్మికుడు బిర్యానీ తినాలనిపించి హోటల్‌కి వెళ్లాడు. అదే, అతనికి చివరి రోజైంది. హైదరాబాద్‌లో జరిగిన అమానుష ఘటన ఇది.

Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. బిర్యానీ తినేందుకు వెళ్లిన కార్మికుడు చివరకు..
Biryani

Edited By:

Updated on: Dec 17, 2021 | 3:47 PM

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ హోటల్‌ సిబ్బంది దారుణానికి తెగబడ్డారు. అర్ధరాత్రి బిర్యానీ కోసం వచ్చిన ఓ యువకుడిని కొట్టి చంపేశారు. ఒడిషాకి చెందిన రాజేష్… తన కుటుంబంతో కలిసి మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌లో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రగతి నగర్‌లో పని ముగించుకుని రాత్రి ఇంటికి బయల్దేరాడు. ఆ టైమ్‌లో అతనికి బిర్యానీ తినాలనిపించి, కూకట్‌పల్లిలో మెయిన్ రోడ్డు పక్కనున్న మొఘల్స్‌ పారడైస్‌ రెస్టారెంట్‌కి వెళ్లాడు. హోటల్‌ ఎంట్రన్స్‌ దగ్గర ఎవరూ కనిపించకపోవడంతో సెల్లార్‌లో ఎవరైనా ఉన్నారేమోనని అక్కడికెళ్లాడు. అదే, అతనికి శాపమైంది. అదే సమయంలో అక్కడ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న హోటల్‌ సిబ్బంది….రాజేష్‌ని దొంగగా భావించి మూకుమ్మడి దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. అపస్మారకస్థితిలో పడిపోయిన అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఉదయం వచ్చిన హోటల్‌ సిబ్బంది అతడిని గమనించి జేబులో ఉన్న ఫోన్ నెంబర్‌ ఆధారంగా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్‌… హోటల్‌ సిబ్బంది కొట్టిన దెబ్బకు మరణించాడు.

దొంగనుకుని కొట్టామని హోటల్‌ సిబ్బంది చెప్పినట్లు రాజేష్ భార్య అంటోంది. రాజేష్ దొంగో కాదో తెలియదు. దొంగ అయితే మాత్రం ఇలా కొట్టిచంపేస్తారా? మానవత్వం లేదా? అంటూ స్థానికులు సైతం కంటతడి పెట్టారు. రాజేష్ వైఫ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కేపీహెచ్‌బీ పోలీసులు.

Also Read..

Tragedy: కూలిన స్కూల్ గోడ.. చితికిన విద్యార్థుల బ్రతుకులు.. ముగ్గురు దుర్మరణం..

Nasa: అంతరిక్ష చరిత్రలో సంచలనం !! సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ !! వీడియో