వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళతో కలిసి కిడ్నాప్ డ్రామా.. చివరకు

అతడు చేతికందిన మేర అప్పులు చేశాడు. అవి తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెంచారు. దీంతో ఏం చెయ్యాలా అని ఆలోచించి మాస్టర్ స్కెచ్ రెడీ చేశాడు.

వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళతో కలిసి కిడ్నాప్ డ్రామా.. చివరకు
Kidnap
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 02, 2021 | 9:35 PM

అతడు చేతికందిన మేర అప్పులు చేశాడు. అవి తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెంచారు. దీంతో ఏం చెయ్యాలా అని ఆలోచించి మాస్టర్ స్కెచ్ రెడీ చేశాడు. ఏకంగా కిడ్నాప్ డ్రామా ప్లే చేశాడు. తానే కిడ్నాప్ అయినట్లు నటించి తల్లిదండ్రుల వద్ద నుంచే రూ.25 లక్షలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాడు. సహోద్యోగి భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న అతను.. ఆ మహిళతో కలసి ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానా పానిపట్​లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గత నెల 25న ఢిల్లీ రోహిణీ ప్రాంతంలో ఒక పార్టీకి హాజరైన రోజు నుంచి కనిపించట్లేదని కిడ్నాప్​కు గురైన వ్యక్తి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై ఐపీసీ 356 సెక్షన్​ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆ వ్యక్తి చివరిసారిగా సెక్టార్ 22 వద్ద ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో.. కిడ్నాప్ అయిన వ్యక్తి తల్లిదండ్రులకు జూన్ 28న ఓ మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారి కొడుకు భారీ స్థాయిలో అప్పులు చేశాడని.. అవి తీర్చేందుకు వెంటనే రూ.25 లక్షలు పంపాలని ఆమె చెప్పింది. అయిదు బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి.. డబ్బు జమ చేయాలని సూచించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సదరు మహిళ ఆగ్రా సమీపంలోని తుండాలా అనే ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..  కిడ్నాప్​ అయిన వ్యక్తి రిషికేశ్​లో ఉన్నట్లు ఆ మహిళ తెలిపింది. డబ్బు కోసం ఇద్దరూ కలిసి కావాలనే ఈ డ్రామా ప్లే చేసినట్లు వెల్లడించింది.

Also Read: శ్రీగంధం తోటల్లో ఊహించని సిత్రాలు.. ఖంగుతిన్న ఖాకీలు.. మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టు

ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..