AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్ జిల్లాలో విషాదం.. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి

వికారాబాద్ జిల్లా విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు.

వికారాబాద్ జిల్లాలో విషాదం.. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Balaraju Goud
|

Updated on: Feb 21, 2021 | 3:21 PM

Share

వికారాబాద్ జిల్లా విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. నారాయణపేట జిల్లా వోట్కూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ హైమద్‌(38) వికారాబాద్‌ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గత నవంబర్‌ నుంచి ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఓ ఉపాధ్యాయుడు డ్యూటీ చేస్తారు. హైమద్‌ శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు తర్వాత బాత్రూంకు వెళ్లారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ గార్డు సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఉపాధ్యాయుడు కుప్పకూలి పడిపోయాడు. దీంతో వెంటనే విషయాన్ని ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. 108 సహాయంతో ఖలీల్‌ను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిశీలించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః  పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!