పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు
పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య రాజకీయాంగా హీటు పెంచుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తుటాలు..
పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య రాజకీయాంగా హీటు పెంచుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ జంట హత్యలు మంథనిలో రాజకీయ సెగలు రేపుతున్నాయి. గట్టు దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ ఇవాళ ఛలో గుంజపడుకు పిలుపునిచ్చింది. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు గుంజపడుగులో పర్యటించనున్నారు. గట్టు వామన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి… హత్యకు కారణాలపై వివరాలను తెలుసుకుంటారు. లాయర్ దంపతుల హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు పాయింట్ టూ పాయింట్… ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా విచారిస్తున్నారు. వామనరావు హత్య కేసు నడుస్తుండగానే… రాష్ట్రంలో ఇప్పుడు మరిన్ని గుడి భూముల వివాదాలు తెరమీదకు వస్తున్నాయి.
లాయర్ వామన్‌రావు హత్యకు గుడి స్థల వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీనితో రాష్ట్రంలోని ఆలయ భూముల వివాదాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. హన్మకొండలోని ఓ ఆంజనేయస్వామి దేవాలయం… దాతలు-పూజారి మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. టెంపుల్ స్థలం నాదంటే నాదంటూ ఇరు పక్షాలు పోరాడుతున్నాయి. హనుమాన్ దేవాలయాన్ని ఆలయ పూజారి ఆక్రమించి, తమకు ఆలయంలో ప్రాధాన్యత లేకుండా చేశారని గుడి దాతలు ఆరోపిస్తుంటే… గుడిలో పూజలు చేస్తూ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పూజారి అంటున్నారు. ఆలయ దాతలు-పూజారీ మధ్య వివాదం నేపథ్యంలో ఆభయాంజనేయస్వామి గుడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్‌లోని అభయాంజనేయ స్వామి దేవాలయం భూమిని శంకర్ సింగ్ అనే వ్యక్తి 40 ఏళ్ల క్రితం హనుమాన్ దేవాలయానికి దానం ఇచ్చాడు. వారి చేతుల మీదుగానే ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో గోపాల్ మహరాజ్ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. 1990లో నర్సింహస్వామి అనే వ్యక్తి అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించి.. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం… శంకర్ సింగ్ కొడుకు ఠాకూర్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేయడంతో వివాదం రాజుకుంది. ఈ స్థలానికి సంబంధించిన అన్ని హక్కులు తమవేనంటూ ఠాకూర్ సింగ్ కూతురు అనిత, మాజీ పూజారి గోపాల్ మహరాజ్ వారసులు న్యాయపోరాటం చేస్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి గుడిలో దేవుడికి నిత్యం పూజలు చేస్తూ దూపదీప నైవేద్యాలు అర్పిస్తూ.. ఆలయ అభివృద్ధికి కృసి చేస్తున్నానని… ఇప్పుడు వచ్చి గుడి స్థలం తమదనం తగదని ఆలయ పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి అర్చకుడు నర్సింహామూర్తిని బెదిరిస్తుననారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.